Thursday, April 3, 2025
HomeTelanganaకాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతిమ‌యం | బీజేపీ నేత ఏలేటి విమ‌ర్శ‌

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతిమ‌యం | బీజేపీ నేత ఏలేటి విమ‌ర్శ‌

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతిమ‌య‌మైంద‌ని బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష‌ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమ‌ర్శించారు. ఈ అవినీతి పై చ‌ర్చ‌కు అఖిలప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప‌త్రికా స‌మావేశంలోని ప్ర‌ధానాంశాలు –

రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపై ఎప్పటికప్పుడు బీజేపీ బయటపెడుతోంది

ఇప్పుడు మరో కుంభకోణం బయట పెడుతున్నా

నేను ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎవరిపై ఆరోపణలు చేయలేదు

ప్రజా వ్యతిరేక అంశాలపైనే నేను పోరాడుతున్నా

బీజేపీ శాసనసభ పక్ష నేతగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నా

రైతులు పండించిన పంటలు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి తెలంగాణలో లేదు

కొనుగోలు కేంద్రాల్లో ప్రతి బస్తాకు 2 నుంచి 4 కిలోలు అదనంగా తూకం చేస్తున్నారు

వాటికి రశీదు ఇవ్వడం లేదు

ఇలా ఒక్కో క్వింటాల్ కు 10 నుంచి 12 కిలోలు కొల్లగొడుతున్నారు

అధిక దాన్యం జోకడంతో వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయి

సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ రాష్ట్ర ప్రజల ఇబ్బందులను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది

కొల్లగొట్టిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఏమవుతున్నాయనేది సివిల్ సప్లయ్ కమిషనర్, శాఖ మంత్రి సమాధానం చెప్పాలి

కొత్తగా ‘యూ’ ట్యాక్స్ పేరిట అధికారులకు ఎంత ఇస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నారు

ఆ డబ్బులో నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.500 కోట్లు కేసీ వేణుగోపాల్ కి ఇచ్చింది వాస్తవం కాదా

సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారు

తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా

దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? అధికారులు బాధ్యత వహిస్తారా?

సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ కి వ్యవసాయం గురించి తెలియదనకుంటా

రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా

డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా?

ముఖ్యమంత్రి దీనిపై అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయండి

మేము ఈ తప్పులను నిరూపిస్తాం

ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణం

స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలి.. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా

మాహేశ్వర్ రెడ్డి ఏనాడూ చౌహాన్ కు వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ చేయలేదు

సీఎంఆర్ కింద 25 వేల కోట్ల ధాన్యం రైస్ మిల్లర్ల వద్ద ఉంది

సీఎంఆర్ కు ధాన్యం ఇవ్వని రైస్ మిల్లులు ఎన్ని ఉన్నాయి.. వివరాలు ఉన్నాయా?

ఎందుకు జాప్యం జరుగుతోందని ఆరా తీసారా? చర్యలు తీసుకున్నారా?

డిఫాక్టర్లుగా ఎన్ని రైస్ మిల్లులను గుర్తించారు

రైస్ మిల్లర్ల తో మంత్రి కుమ్మక్కయ్యారు

రూ.450 కోట్లు రైస్ మిల్లర్లు ఇచ్చారు

ఇది మొత్తం 950 కోట్ల కుంభకోణం

రాష్ట్రంలో శాఖల వారీగా ఎవరికి వారుగా టోల్ గేట్లను ఏర్పాటు చేశారు

ఇది కేవలం సివిల్ సప్లయ్ టోల్ గేట్ మాత్రమే.. ఇతర శాఖల టోల్ గేట్లు కూడా బయట పెడతాం

పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

రీసైక్లింగ్ చేస్తున్న బియ్యాన్ని టెస్ట్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలైనా చేసిందా?

రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని అంటోంది

ఇది కేవలం ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఉంటుంది

మంత్రి ఉత్తమ్ కేవలం తన జిల్లాకు న్యాయం జరిగితే చాలని భావిస్తే సరిపోదు

తెలంగాణ మొత్తం దొడ్డు బియ్యం పండిస్తారు

కోటి 20 లక్షల మెట్రిక్ టన్నుల్లో.. కోటి 15 లక్షల టన్నులకు బోనస్ ఇవ్వరనేది అర్థమైంది

ఈ విషయం పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు

కేసీఆర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ నడుస్తోంది

5 శాతం మంది రైతులకే లబ్ధి జరుగుతోంది.. 95 శాతం రైతుల పరిస్థితి ఏంటి?

దీనిపై మరోసారి రివ్యూ చేసుకుంటే మంచిది

కాంగ్రెస్ తీరు చూస్తుంటే.. కేసీఆర్, కాంగ్రెస్ కలిసే సంసారం చేసినట్లుగా ఉంది

RELATED ARTICLES

తాజా వార్తలు