మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు.