కీరవాణి ఎంపిక నాది కాదుః రేవంత్
జయ జయ హే తెలంగాణ గీతానికి సంగీతం సమకూర్చడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణిని నియోగించడం వివాదాస్పదంగా మారింది. దీంతో అతడి ఎంపికతో తనకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయవలసి వచ్చింది. పాట రచయిత అందెశ్రీ ఇష్టానుసారం ఎంపిక జరగినట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యను బట్టి తెలుస్తున్నది.
తెలంగాణలో ఎంతో మంది సంగీత వేత్తలు ఉండగా, కీరవాణిని ఎంపిక చేయడంపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఎంపికతో తనకు సంబంధం లేదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకున్నారు.