గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ
రైతాంగానికి భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని తెలిపింది.
రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకు ఇవి విస్తరించనున్నాయి..