తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి ఐఏఎస్ అధికారుల కీలక బదిలీలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎ.శాంతి కుమారి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు దఫాలుగా చర్చించిన తర్వాత తుది జాబితాను ఖరారు చేశారు.