రేవంత్ పైన విరుచుకుపడిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రేవంత్ అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సమాధి నుంచి తలదించుకుంటున్నారన్న/ఏడుస్తున్నారన్న కేటీఆర్
60 ఏళ్ల పాటు తెలంగాణకు గోస పెట్టి, వేల మందిని క్రూరంగా చంపిన పార్టీ కాంగ్రెస్
తెలంగాణ ప్రయోజనాలను హక్కులను వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్ బిజెపి తోడు దొంగలు
తెలంగాణ హక్కులను కాపాడటంలో రేవంత్ విఫలమైన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు
ఇప్పటికే జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్, సింగరేణి ప్రైవేటీకరణకు బిజెపికి సహకారం అందిస్తున్నారు
గతంలో అడ్డగోలుగా తెలంగాణ గనులను రెండు కంపెనీలకు బిజెపి కేటాయించినా, బిఆర్ఎస్ వ్యతిరేకించడం వల్లనే అక్కడ మైనింగ్ ప్రారంభం కాలేదు
కానీ ఈరోజు గనుల వేలంకు కాంగ్రెస్ బిజెపి ఒకటి అయ్యాయి
రేవంత్ చెప్పిన రెండు కంపెనీలు గతంలో కాంగ్రెస్ శివసేన ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రలో గనులు దక్కించుకున్నాయి
రేవంత్ రెడ్డి పైన, ఆయన చేస్తున్న అబద్ధాల పైన బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్, ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ తమ పార్టీ అన్న కేటీఆర్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా, వాటిని క్రూరంగా అణిచి, వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్ బిజెపి కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ మరియు బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాని ఎల్లప్పుడూ వ్యతిరేకించింది అని తెలిపిన కేటీఆర్ అందుకే ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిసిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని, కానీ బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడ నుంచి ఒక తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేవని తెలిపారు.
వేలంలో గనులను దక్కించుకున్న రెండు కంపెనీలు కేవలం బిఆర్ఎస్ పార్టీ సింగరేణి ప్రయోజనాల కోసం నిలబడడంతోనే మైనింగ్ ప్రారంభించలేమన్నారు. కేంద్రంలోని బిజెపి గనులను కేటాయించిన, కేవలం రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి వల్లనే నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని ఆ పూర్తి క్రెడిట్ బి ఆర్ ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు. కానీ రేవంత్ పేర్కొన్న ఆ రెండు కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్ మరియు శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లి, జెన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారన్నారు. తాజాగా బిజెపికి మీరు అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న మీ కుట్ర అందరికీ తెలిసిపోయిందన్నారు.
గనుల వేలంలో పాల్గొన్న మిమ్మల్ని, మీ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని, తెలంగాణ రాష్ట్రానికి మీరు, మీ జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెప్తారన్నారు.