Wednesday, January 1, 2025
HomeTelanganaత్వ‌ర‌లో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు

త్వ‌ర‌లో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు. దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

RELATED ARTICLES

తాజా వార్తలు