Thursday, January 2, 2025
HomeInternationalదక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు

దక్షిణాఫ్రికాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు

14న పార్లమెంటు సమావేశం

దక్షిణాఫ్రికాలో సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు

14న పార్లమెంటు సమావేశం

(గుర్రాల నాగరాజు, దక్షిణాఫ్రికా)

దక్షిణాఫ్రికా ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు సాగుతున్నాయి. మే 29 వ తేదీన జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ లభించలేదు. 1994 లో స్వాతంత్ర్యం వ చ్చిన నాటి నుంచి ముప్పై ఏండ్లుగా ఆఫ్రికన్ నేషనల్ పార్టీ (ఎఎన్సి) అధికారంలో ఉన్నది. కానీ ఈసారి ఈ పార్టీకి యాభై శాతానికి మించి ఓట్లు రాకపోవడంతో అన్ని పార్టీలను కలుపుకొని జాతీయ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నది.
దక్షిణాఫ్రికా పార్లమెంటుకు నైష్పత్తిక ప్రాతినిధ్యం ద్వారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది నిర్ధారణ జరుగుతుంది. పార్లమెంటులోని 400 సీట్లలో ఎఎన్సికి 159 మాత్రమే లభించాయి. తెల్లజాతి వారికి చెందిన, స్వేచ్ఛా మార్కెట్ను కోరుకునే డెమొక్రాటిక్ అలయన్స్ పార్టీకి 87 సీట్లు ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా నేతృత్వం లోని ఉమేంటో వె సిజ్వే (ఎంకె) పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సైద్ధాంతిక దృక్పథం కలది. ఈ పార్టీకి 58 స్థానాలు వచ్చాయి. వామపక్షమైన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ (ఇఎఫ్ఎఫ్) 39 సీట్లు తెచ్చుకోగలిగింది. ఎఎన్సీ నాయకుడు, ఇప్పటి వరకు దేశాధ్యక్షుడిగా ఉన్న సిరిల్ రామఫోసా ఇక ముందు కూడా కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే జులు తెగకు చెందిన నాయకుడు, మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా కూడా మెజారిటీ కూడగట్టగలననే ఆశతో ఉన్నారు. ఇది సాధ్యమైతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది.
తెల్లజాతి పార్టీ వ్యాపార వర్గాలకు అనుకూలమైనది. కాగా మిగతా పార్టీలు ప్రజా సంక్షేమ విధానాలను కో రుకుంటాయి. ఈ నేపథ్యంలో అందరికీ మధ్యేమార్గంగా కనిపించేది చివరికి ఎఎన్సీ పార్టీయే. యాభై శాతం సీట్లతో అధికారాన్ని చేపట్టే నాయకుడు ఆవిర్భవించక పోతే, ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా చిన్న పార్టీలను తొలగిస్తూ మెజా రిటీ నాయకుడిని నిర్ధారిస్తారు. ఈ విధానం కూడా ఎఎన్సికి అనుకూలంగా ఉంటుంది. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, దేశాధ్యక్షుడి ఎన్నిక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో సాగుతాయి. మొత్తం ఓట్లలో ఎఎన్సి కి 40 శాతం, డెమొక్రాటిక్ అలయన్స్కు 22 శాతం, జాకబ్ జుమ నేతృత్వంలోని ఎంకె పార్టీకి 15 శాతం, వామపక్ష ఇఎఫ్ఎఫ్ కు 9 శాతం వాటా ఓట్లు లభించాయి.
1994లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎఎన్సి నాయకుడైన నెల్సన్ మండేలా ప్రథమ దేశాధ్యక్షుడు అయ్యారు. అయితే ఆయన ఒక పార్టీకి వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని, ప్రజల మధ్య సౌహార్దత సాధించాలని నిర్ణయించారు. ఈ మేరకు తెల్లజాతీయుడిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. తాము తెల్ల జాతి పాలనకు వ్యతిరేకంగా పోటీ చేసినప్పటికీ, ఈ సౌహార్దతను ప్రదర్శించారు. స్వాతంత్ర్యానికి పూర్వం జులు తెగ వారికి, ఎఎన్సి కార్యకర్తలకు జరిగిన ఘర్షణలలో వేలాది మంది మరణించారు. అయినప్పటికీ మండేలా తమ తె గవారితో తరచు ఘర్షణలు జరిగే జులు తెగ వారికి కూడా ప్రభుత్వంలో చోటు కల్పించారు. ఇప్పుడు కూడా భిన్న వ ర్గాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావలనే వాదన వినబడుతున్నది.

దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నందున జాతీయ ప్రభుత్వం ఏర్పడిన దేశ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పదేండ్లుగా దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి పతనమవుతూ ఉన్నది. నిరుద్యోగం దాదాపు 33 శాతానికి చేరుకున్నది. ఇది ప్రపంచదేశాలలోనే అత్యధికం. పేదరికం పెరిగిపోయింది. తరచు కరెంటు కోతలు ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పెరుగుదల గత ఏడాది 0.6 శాతం మాత్రమే ఉన్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు