Wednesday, January 1, 2025
HomeTelanganaప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో ఘోర ప‌రాజయం చ‌విచూసింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ దుస్థితి కార‌ణం ఏంద‌ని, భ‌విత‌వ్యం ఏమిట‌నేది చాలా మంది విమ‌ర్శ‌కుల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. దానికి తోడు కొంత‌మంది నేత‌లు ఫిరాయింపులు చేస్తుండ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లి లోని నివాసంలో ప‌లువురు నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నారు.

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని మంగళవారం ఎర్రవెల్లి లోని వారి నివాసంలో పలువురు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు . ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి , కేపీ వివేకానంద , అరికెపూడి గాంధీ , మాగంటి గోపీనాథ్ , మాధవరం కృష్ణారావు , ముఠా గోపాల్ , టి . ప్రకాష్ గౌడ్ , ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి , దండే విఠల్ , మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న , పార్టీ నాయకులు క్యామ మల్లేష్ , రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు
అధినేత కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు .

రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో ఇటీవల బి ఆర్ ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులు కౌశిక్ హరి కుటుంబ సమేతంగా బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిశారు . కేసీఆర్ గారు హరికి శుభాకాంక్షలు తెలిపారు .

RELATED ARTICLES

తాజా వార్తలు