Wednesday, January 1, 2025
HomeNationalపోర్ష కారు ప్రమాదం కేసులో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు

పోర్ష కారు ప్రమాదం కేసులో ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు

పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి టీనేజ్ కుమారుడు పోర్ష కారు నడుపుతూ ఇద్దరి మరణానికి కారకుడైన ఘటనపై మహా రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్పర్సన్గా గ్రాంట్ మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ పల్లవి సపాలెను నియమించింది. ఈ కేసులో ఇటీవలే ఇద్దరు వైద్యులను, ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. పుణె లోని సాసూన్ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు నిందితుడి రక్త నమూనాలను మార్చివేశారనే ఆరోపణ ఉంది. నిందితుడైన టీనేజర్ అప్పటికే మద్యం సేవించి కారు నడిపించాడు. రక్తంలో మద్య ఆనవాళ్ళు బయట పడకుండా ఉండేందుకు రక్త నమూనాలను ఆ నిందితుడి రక్త నమూనాలకు బదులుగా ఇతరుల నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఈ రెండు రక్త నమూనాలలో తేడా ఉండటంతో అసలు విషయం బయట పడింది. పైగా నిందితుడు కారు నడపడానికి ముందు మద్యం సేవించినట్టు రెస్టారెంట్లలో విజువల్స్ బయటపడ్డాయి.

కారు ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారకుడైన టీనేజర్ను కాపాడటానికి తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇద్దరు మరణానికి కారకుడైన ఈ టీనేజర్కు మూడు వందల పదాల వ్యాసం రాయడం, పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసుతోపాటు విధులు నిర్వహించడం, కౌన్సిలింగ్ హాజరు కావడం వంటి తేలికపాటి శిక్ష విధించడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నది. ఎన్నికలు సీజన్ కావడంతో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించక తప్పలేదు.

RELATED ARTICLES

తాజా వార్తలు