Wednesday, January 1, 2025
HomeTelanganaఫిరాయింపుల‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ప్రెస్ మీట్

ఫిరాయింపుల‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ప్రెస్ మీట్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తాత మధు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మా పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం .సంజయ్ కుమార్ బిఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉంది. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామ‌ని తెలిపారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు వీరిద్దరి సభ్యత్వాలు రద్దు కావాల‌ని అన్నారు.

పాంచ్ న్యాయ్ తీర్మానం ప్రకారం ఫిరాయింపులు ప్రోత్సహించవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెబుతున్నార‌నీ, రాహుల్ బిజెపిపై దాడి చేస్తుంటే ఇక్కడ రేవంత్ బిజెపికి తోకలా వ్యవహరిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. మోదీ విధానాలను రేవంత్ ఫాలో అవుతున్నాడ‌ని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడ‌ని, త‌న పదవిని కాపాడుకోవటానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడ‌ని అన్నారు.

విద్యుత్ శాఖ కు సంబంధించిన ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న స్పందించారు. కమిషన్ విచారణ వద్దనటం లేద‌నీ..జస్టిస్ నర్సింహ రెడ్డిని తప్పించాలని కోరుతున్నామ‌ని వివ‌రించారు. విచారణలో అన్ని తేటతెల్లం అవుతాయి…కెసిఆర్ మల్లె పూవులా బయటకు వస్తార‌ని వెల్ల‌డించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు