బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది.
రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
ఆదివారం ఉదయం ఈటల రాజేందర్ తో ఫోన్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు.
అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపారు.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బాగా పుంజుకుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని శర్మ సూచించారు.
తెలంగాణలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు తెలిసింది.
దీనికి ఈటెల రాజేందర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
రేపు ఈటెల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.
ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.