బీజేపి తో జతకట్టం
తాము బీజేపి కూటమిలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను శివసేన(ఉద్దవ్) ఖండించింది. కొందరు కావాలని ఇటువంటి పుకార్లను వ్యాపింప చేస్తున్నారు. శివసేన(ఉద్దవ్) పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది X (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. బీజేపి కి రాష్ట్రం నుంచి మెజారిటి స్థానాలు వస్తాయని ఆశపడి కొందరు ఆ శిబిరం వైపు వెళ్లారని అది సాధ్యపడక పోవడంతో ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారని ఆమె అన్నారు.
మహారాష్ట్ర నుంచి శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు ఎక్కువగా గెలవడంతో షిండే(శివసేన), అజిత్ పవార్(ఎన్సీపీ) వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలలో కలవరం నెలకొన్నది. అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే తమ తమ పార్టీ సహచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. బీజేపీ శిబిరం వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలను మళ్ళీ చేర్చుకోవడానికి కొంత సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది.