మహనీయుల చిత్రపటాల సరసన ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో !
👉 శాసనమండలి ఛాంబర్ లో ముక్కున వేలేసుకునే దృశ్యాలు
👉 రాష్ట్రంలో ముదురుతున్న స్వామి భక్తి
👉 కలికాలం అంటున్న ప్రజాస్వామికవాదులు
కాంగ్రెస్ పాలనలో అధికారుల స్వామి భక్తి ముదిరిపోతుంది. సాక్షాత్తు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛాంబర్ లో జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప్రముఖ సామాజిక వేత్త, మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే చిత్రపటాల సరసన రేవంత్ రెడ్డి ఫోటోను చేర్చారు.
గురువారం శాసనమండలికి నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు అక్కడ ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోయారు. మహాత్ముల సరసన రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఏంటని అక్కడ చర్చ నడిచింది.