వైద్య,విద్యలో ఆల్ ఇండియా పూల్ నీట్ పరీక్షపై లాభం జరుగుతుందా…నష్టం జరుగుతుందా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ ఫర్ట్ కమిటీ వేయాలి అని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
🟢నీట్ పరీక్ష లీకేజీ వరకే కాకుండా ఆల్ ఇండియా కోటాపై ఎక్స్ ఫర్ట్ కమిటీ వేయాలి
🟣 మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
🟣 హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం
🟢నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
🟢బీహార్,గుజరాత్ నుంచి నీట్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి
🟢కోట్ల రూపాయలు చేతులు మారాయి అంటున్నప్పటికి దీనిపై ED ఎందుకు కేసు నమోదు చేయలేదు
🟢తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు
🟢రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు… మనం అదే బాటలో ముందుకు వెళ్ళాలి
వైద్య ,విద్యలో ఆల్ ఇండియా పూల్ నీట్ పరీక్ష వల్ల తెలంగాణ రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 30 వైద్య పీజీ కళాశాలలుండగా, అందులో ప్రభుత్వ పీజీ కళాశాలలు 10 ఉన్నాయి. వీటిలో మొత్తం 2,978 సీట్లుండగా, ప్రభుత్వ సీట్లు 1,267 మాత్రమే ఉన్నాయి. అయితే వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 50 శాతం సీట్లు ‘ఆల్ ఇండియా’ కోటా కిందకి వర్తిస్తాయి. ఈ కోటా కారణంగా మన తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యార్థులు 621 సీట్లను కోల్పోతున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు అన్నారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్ సింగ్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి గార్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 54 వైద్య కళాశాలలుండగా, అందులో ప్రభుత్వ కళాశాలలు 27 ఉన్నాయి. వీటిలో మొత్తం 8,265 సీట్లుండగా, ప్రభుత్వ సీట్లు 3,815 మాత్రమే ఉన్నాయి. అయితే వీటిలో ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతం సీట్లు ‘ఆల్ ఇండియా’ కోటా కిందకి వర్తిస్తాయి. ఈ కోటా కారణంగా మన తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యార్థులు 519 సీట్లను కోల్పోతున్నారు.
2017లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నీట్ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు రెండే రెండు ప్రయోజనాలున్నాయి.
1.ఆల్ ఇండియా కోటాను వాడుకునే వెసులుబాటు ఉన్నది.
2.సీట్ల పెంపు వల్ల మెరుగైన అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది.
అయితే ‘నీట్’ వల్ల తెలంగాణ వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. తెలంగాణలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఆల్ ఇండియా కోటా కిందకు ఎక్కువ సీట్లను మన విద్యార్థులు కోల్పోతున్నారు. ప్రభుత్వ కళాశాలను మాత్రమే ఆల్ ఇండియా కోటా కిందికి తేవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతున్నది.
ఇతర రాష్ర్టాల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో మన తెలంగాణకు చెందిన విద్యార్థులు ఆయా రాష్ర్టాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. మన దగ్గర ఉన్న వసతుల దృష్ట్యా ఇతర రాష్ర్టాల విద్యార్థులు తెలంగాణ రాష్ర్టానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ఒక్కసారి తెలంగాణలో ఎంబీబీఎస్‌లో చేరితే వారు పీజీ చేసేందుకు స్థానికులుగా అర్హత సాధిస్తున్నారు. కానీ, మన తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ర్టాల్లో ఎంబీబీఎస్ చదివితే అక్కడ నాన్ లోకల్‌గా, ఇక్కడా నాన్‌లోకల్‌గా మారిపోతున్నారు. దీంతో మన వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌తోనే చదువుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. మన విద్యార్థులు నాన్‌లోకల్‌గా మారిపోతుండటం వల్ల చదువాలని ఉన్నా పీజీ చేయలేకపోతున్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ నాన్ లోకల్‌గా మారిపోతుండటం వల్ల అక్కిడికి వెళ్లి చదువుకోవడానికి ఆనాసక్తిని కనబరుస్తున్నారు.
నీట్‌లో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నీట్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే టాప్ ర్యాంకులు సాధించేవారు. కానీ, ఈసారి ఏకంగా 67 మంది (720/720) టాపర్లుగా నిలవడమే అనుమానాలను బలపరుస్తున్నాయి. అంతేకాదు, హర్యానాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులు టాపర్లు కావడం వల్ల పేపర్ లీక్ జరిగిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కొన్నిచోట్ల ఆంగ్ల పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మన తెలంగాణలోని కొమ్రం భీమ్ జిల్లాలో దేశంలో అందరికీ ఇచ్చిన పేపర్ కాకుండా వేరే ప్రశ్నాపత్రం ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇది నిజంగా దారుణం. పరీక్ష నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
ఇప్పటికే బీహార్, గుజరాత్‌లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30 లక్షల వరకు తీసుకొని పేపర్ లీక్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కొంతమందిని అరెస్టు కూడా చేసింది. సాధారణంగా నీట్‌లో 180 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఇస్తారు. ఈ లెక్కన 180 ప్రశ్నలకు సరైన సమాధానం రాసినవారికి 720 మార్కులు వస్తాయి. ఒకవేళ 179 ప్రశ్నలకే సరైన సమాధానం ఇస్తే అతనికి 716 మార్కులే వస్తాయి. ఒకవేళ ఒక ప్రశ్న తప్పుగా రాస్తే.. వచ్చిన 716 మార్కుల నుంచి 1 మార్కు తగ్గించాలి. కానీ, ఇప్పటివరకు ఎన్నడూ లేనివిధంగా 718, 719 మార్కులను కూడా ఈసారి మనం చూశాం. ఏమైనా అంటే ఆలస్యంగా ప్రశ్నపత్రాలు ఇవ్వడం వల్ల కొంతమందికి గ్రేస్ మార్కులు కలిపామని, దానివల్ల 718, 719 మార్కులు వచ్చాయని ఎన్టీఏ డైరెక్టర్ చెప్పడం హాస్యాస్పదం. కోర్టులో కేసు వేయగానే గ్రేస్ మార్కులను తీసేశారు. అసలు గ్రేస్ మార్కులు ఏ లెక్కన కలిపారు? ఎందుకు కలిపారు? ఎంతమందికి కలిపారు? అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉన్నది. ఇప్పుడు తాజాగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్‌లో తప్పులు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. తప్పు జరిగిందని అంగీకరిస్తున్నా పరీక్షను రద్దు చేయడం లేదు. కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పడం ఆందోళనకరం. అసలు వైద్య విద్య అనేది విద్యా శాఖ కిందికే రాదు. దీన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పర్యవేక్షించాలి. కానీ, ఇప్పటివరకు వైద్యశాఖ మంత్రి దీనిపై స్పందించకపోవడం విడ్డూరం.
నీట్ ఫలితాలు జూన్ 14న విడుదలవుతాయని మొదట ఎన్టీఏ ప్రకటించింది. కానీ, దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు హడావుడిగా జూన్ 4న ఎవరికీ తెలియకుండా విడుదల చేసేశారు. తప్పులు జరిగాయి కాబట్టే ఆ రోజు ఎవరూ పట్టించుకోరని ఫలితాలను విడుదల చేశారు. పరీక్షా పే చర్చ అంటూ హడావుడి చేసే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు కనీసం స్పందించడం కూడా లేదు. నాడు టీఎస్‌పీఎస్సీ లీకులపై గాయి గత్తర చేసిన బీజేపీ నాయకులకు ఇప్పుడు నీట్ వ్యవహారం కనిపించడం లేదా? అసలు నీట్‌లో ఉత్తరాది వాళ్లకే ఎందుకు ఎక్కువ సీట్లు వస్తున్నాయి? వాళ్ల లబ్ధి కోసమే నీట్‌ను నిర్వహిస్తున్నారా?
పరీక్షను రద్దుచేయాలని లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు? విద్యార్థుల బతుకులు ఆగమవుతున్నా కోర్టులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత చేసేదేమీ ఉండదు. అందుకే ఇప్పుడే ఈ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. నీట్ వల్ల చాలా రాష్ర్టాలు నష్టపోతున్నాయి. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. వైద్య విద్య ప్రవేశాలు ఆయా రాష్ర్టాలకే అప్పగించాలి.
బీహార్,గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయని, కోట్ల రూపాయలు చేతులు మారితే ED వెంటనే కేసు నమోదు చేస్తుంది… ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.