హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దాడులు అధికమవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. హత్యలకు వెనుకాడడం లేదు కాంగ్రెస్ నేతలు. మొన్న వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేశారు. ఈ ఘటనను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. దాడికి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యా రాజకీయాలు, బెదిరింపులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతో నిలువరించలేదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.