Saturday, January 4, 2025
HomeTelanganaసీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్ర‌చారం : మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్ర‌చారం : మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

మాజీ ఎంపీ లు బి .వినోద్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్ @ తెలంగాణ భవన్

రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తో కలిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ తరహాలో మాట్లాడారు. సీఎం స్థానం లో ఉండి రేవంత్ రెడ్డి సైనిక్ స్కూల్ పై అబద్దాలు మాట్లాడారు. సైనిక్ స్కూల్ పై కేసీఆర్ పట్టించుకోలేదు అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సీఎం కార్యాలయం లో కేసీఆర్ కేంద్రానికి రాసిన ఉత్తరాలు ఉంటాయి. వాటిని రేవంత్ ఓ సారి చూడాలి. వరంగల్ లో సైనిక్ స్కూల్ మంజూరు అపుడే మంజూరు చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ ను సైనిక్ స్కూల్ గురించి అనేక సార్లూ కలిశాం. దివంగత అరుణ్ జైట్లీ ని కూడా బీ ఆర్ ఎస్ ఎంపీ లుగా చాలా సార్లు కలిశాము. రక్షణ శాఖ ఆధ్వర్యం లో సైనిక్ స్కూల్ లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయి అని మాజీ ఎంపీ లు బి. వినోద్ కుమార్ వివ‌రించారు.
రక్షణ శాఖ భూముల పై కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయ‌ని, రేవంత్ రెడ్డి కి సమయం ఉంటే అప్పటి డిఫెన్స్ అధికారి జె ఆర్ కే రావు తో మాట్లాడి నిజాలు తెలుసుకోవాల‌ని తెలిపారు.
బీ ఆర్ ఎస్ తెలంగాణ సమస్యల పై కేంద్రం తో నిజాయతీ తో కోట్లాడింద‌నీ ..ఇక ముందు కూడా కొట్లాడుతామ‌ని ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు