Thursday, April 3, 2025
HomeNationalహిమాచల్లో ప్రియాంక ప్రచార హోరు

హిమాచల్లో ప్రియాంక ప్రచార హోరు

హిమాచల్లో ప్రియాంక ప్రచార హోరు

చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్లో మొత్తం నాలుగు లోక్సభ స్థానాలుంటే, మొత్తం నాలుగింటికీ తుదిదశ జూన్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది. దీంతో ప్రియాంక ప్రచారం ప్రాధాన్యం సంతరించుకున్నది. మే 30 వ తేదీ వరకు ప్రియాంక ప్రచారం హోరెత్తనున్నది.

హిమాచల్ ప్రదేశ్తో ప్రియాంకకు అనుబంధం ఉన్నది. ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ కంచుకోట. దానిని బద్ధలు కొట్టి, అక్కడ కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసిన ఘనత ప్రియాంకకు దక్కుతుంది. రాహుల్ నాయకత్వంలో వరుస పరాజయాలు ఎదురవుతున్న కారణంగా, సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగిన తరువాత, ప్రియాంకను ఎన్నికలు టాస్క్ ఫోర్స్లో చేర్చించింది. దీంతో హిమాచల్, కర్ణాటయ, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కి వ్యూహాలు , కార్యక్రమాలు రూపొందించి విజయ బాటలో నడిపించారు.

2014, 2019 లోక్సభ ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్ నుంచి కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆతరువాత 2021లో జరిగిన మండి లోక్సభ స్థానం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ బాధ్యతలను ప్రియాంక గాంధీకి సోనియా అప్పగించారు. ప్రచార కార్యక్రమం మొత్తం ప్రియాంక నేతృత్వంలోనే సాగింది. రాష్ట్రంలోని నలభై స్థానాలను దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగలిగింది. దీంతో హిందీ ప్రాంతంలో మోదీని ఎదుర్కొని దెబ్బతీయడం సాధ్యమేననే ధైర్యం కాంగ్రెస్ పార్టీలో కలిగింది. ఆనాటి నుంచి ప్రియాంకతో హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు అనుబంధం మరింత బలపడ్డది.
హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనే బీజేపీ కుట్రలు కూడా విఫలమయ్యాయి. బీజేపీ వైపు ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డ‌డంతో వారు శాస‌న‌స‌భ్య‌త్వాన్ని కోల్పోయారు. దీంతో ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు