Monday, January 6, 2025
HomeNationalLift Collapse | రాజ‌స్థాన్ రాగి గ‌నిలో కూలిన లిఫ్ట్‌.. చిక్కుకుపోయిన 15 కార్మికులు

Lift Collapse | రాజ‌స్థాన్ రాగి గ‌నిలో కూలిన లిఫ్ట్‌.. చిక్కుకుపోయిన 15 కార్మికులు

జైపూర్‌: రాజస్థాన్‌లోని రాగి గ‌నిలో లిఫ్ట్ (Lift Collapse) కూలిపోయింది. దీంతో 15 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వారిని ర‌క్ష్మించేందుకు అధికారులు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి రాజ‌స్థాన్‌లోని జుంజును జిల్లాలోని హిందుస్థాన్ కాప‌ర్ లిమిటెడ్ (HCL)కు చెందిన కొలిహాన్ రాగి గ‌నిలో (Kolihan mine) ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గనిలోని లిఫ్ట్ కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కున్నారని తెలుస్తోంది. వారిని రక్షించేందుకు ఎస్‌బీఆర్ఎఫ్‌, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేప‌ట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని​ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ద‌వాఖాన‌కు తరలించారు. వారికి ఎలాంటి ప్రాణభయం లేదని వైద్యులు తెలిపారు. మిగిలిన‌ 12 మంది కార్మికులకు కాళ్లు, చేతులపై స్వల్ప గాయాలు అయ్యాయని, కానీ వారందరూ సురక్షితంగానే ఉన్నారని తెలుస్తున్న‌ది. వారిని నిచ్చెనల ద్వారా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కార్మికులు గనిలోంచి బయటకు వస్తుండగా, లిఫ్ట్ తెగిపోయింది. దీంతో 15 మంది కార్మికులు 1875 అడుగుల లోతులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. కాగా, గని ప్ర‌మాదంపై రాజస్థాన్ సీఎం భజన్​ లాల్​ శర్మ స్పందించారు. కార్మికుల‌ను క్షేమంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు అధికారులను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ ఆందోళ‌న‌ వ్యక్తంచేశారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు