హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఓటర్లు ఎండలను కూడా లెక్క చేయడం లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ దాటింది. అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 50.71 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ నియోజకవర్గంలో 19.37 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 36 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటి వరకు కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మ. ఒంటి గంట వరకు 50.18 శాతం, నాగర్‌కర్నూల్ పరిధిలో 45.88 శాతం, జహీరాబాద్ పరిధిలో 50.71 శాతం, భువనగిరిలో 46.49, చేవెళ్లలో 34.56 శాతం, హైదరాబాద్‌లో 19.37 శాతం, కరీంనగర్‌లో 45.11 శాతం, ఖమ్మంలో 50.63 శాతం, మహబూబాబాద్‌లో 48.51, మహబూబ్‌నగర్‌లో 45.84 శాతం, మెదక్‌లో 46.72 శాతం, మల్కాజ్‌గిరి పరిధిలో 27.69 శాతం, నల్లగొండలో 48.48 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్దపల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91, వరంగల్ పరిధిలో 41.62 శాతం పోలింగ్ నమోదైంది.