హైదరాబాద్ : ఖమ్మం – వరంగల్ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యాన్ని పట్టభద్రులు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు.
మ. 12 వరకు సిద్దిపేటలో 50.72 శాతం, జనగామలో 49.66, హనుమకొండలో 52.05, వరంగల్‌లో 50.07, మహబూబాబాద్‌లో 49.26, ములుగులో 56.82, భూపాలపల్లిలో 50.52, భద్రాద్రిలో 46.60, ఖమ్మంలో 49.00, యాదాద్రిలో 47.92, సూర్యాపేటలో 52.80, నల్లగొండలో 47.44 శాతం పోలింగ్ నమోదైంది.