Israeli strikes on Lebanon | బీరట్ : లెబనాన్( Lebanon )పై ఇజ్రాయిల్( Israeli ) విరుచుకుపడుతోంది. హెజ్బోల్లా( Hezbollah ) టార్గెట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. సుమారు 1600 టార్గెట్లపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు( Air Strikes ) దాడులకు పాల్పడగా, 492 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 90 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు లెబనాన్ అధికారికంగా ధృవీకరించింది. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో వేల సంఖ్యలో జనాలు తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తల దాచుకుంటున్నారు. 2006 నుంచి మిలిటెంట్ సంస్థ హెజ్బోల్లా నిర్మించిన రహస్య ప్రదేశాలను కూల్చేస్తున్నట్లు ఇజ్రాయిల్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా హెజ్బోల్లా కూడా సుమారు 200 రాకెట్లను వదిలింది. అయితే సోమవారం రాత్రి ఇజ్రాయిల్‌లోని హైఫా సిటీపై.. లెబనాన్‌లోని హెజ్బోల్లా మిలిటెంట్ సంస్థ రాకెట్లతో భీకర దాడి చేసింది. ఆ నగరంపై సుమారు 200 రాకెట్లను ఫైర్ చేసింది హెజ్బోల్లా. అయితే ఆ దాడిని ఇజ్రాయిల్‌లోని ఐరన్ డోమ్(Iron Dome) తిప్పికొట్టింది. దూసుకువస్తున్న రాకెట్లను.. ఆకాశంలోనే పేల్చివేసింది ఐరన్ డోమ్. ఉత్తర ఇజ్రాయిల్‌లోని హైఫా, కిరియత్ బయాలిక్, జెజ్రీల్ వ్యాలీపై రాకెట్ల దాడి జరిగింది.
ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య భీకర యుద్ధం సాగుతుండగా, ప్రపంచ దేశాలు శాంతి సందేశాన్ని వినిపించాయి. దాడుల్ని ఆపాలని రెండు దేశాలను కోరాయి. దాడుల వల్ల వేల సంఖ్యలో కుటుంబాలు చెల్లాచెదురు అయినట్లు ఆరోగ్యమంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు. లెబనాన్‌ను మరో గాజాగా మార్చవద్దు అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. కొన్ని ఇండ్లల్లో హిజ్‌బొల్లా మిలిటెంట్లు.. మిస్సైళ్లు దాచిపెట్టారు. ఆ క్షిపణులకు చెందిన ఫోటోలను ఐడీఎఫ్ దళాలు రిలీజ్ చేశాయి.
The Iron Dome in Action Over Northern Israel. pic.twitter.com/SRhn4RuSJu
— Israel Foreign Ministry (@IsraelMFA) September 23, 2024