హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ప్రశాంతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక ఎన్నికల సమయం ముగుస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటువేసేందుకు తమ వంతు కోసం పెద్ద సంఖ్యలో ఓటర్లు వేచిఉన్నారు. కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగానో 52.34 శాతం పోలింగ్ నమోదవగా, ఆంధ్రప్రదేశ్‌లో 55.49 శాతం నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్‌లో 63.96 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 29.47 శాతం ఓటింగ్ రికార్డయింది. ఇక ఏపీలో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 61.43 శాతం, విశాఖపట్నంలో అత్యల్పంగా 47.66 శాతం పోలింగ్ రికార్డు అయింది. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోగా, తెలంగాణలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నది.