IPL 2024| ఐపీఎల్ సీజన్ 2024 చివరి దశకు చేరుకుంది. గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందిస్తున్న ఈ టోర్నీ రాను రాను మరింత రసవత్తరంగా మారుతుంది. ఫస్టాఫ్ లో కన్నా సెకండాఫ్‌లోనే మ్యాచ్‌లు మజా అందించాయి. ఇక ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కి దగ్గరయ్యే సమయం వచ్చింది. కేకేఆర్ నిన్న ముంబైపై గెలిచి డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్‌కి వెళ్లింది. ఇక ఆర్ఆర్ కూడా దాదాపు ప్లే ఆఫ్స్‌కి వెళ్లినట్టే. మిగతా రెండు స్థానాలు ఎవరు భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అయితే ఐపీఎల్ ఆడిన జట్లలో టేబుల్ దిగువున ఉన్న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి.
మిగిలిన రెండు పొజిషన్ల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. వాటిలో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జియాంట్స్, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. ఈ ఆరు జట్లు చివరి వరకు ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ రోజు రాజస్థాన్‌తో చెన్నై తలపడనుండగా.. ఆర్సీబీ-డీసీ చావోరేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లు మంచి రంజుగా సాగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ రోజు మ్యాచ్‌తో ప్లే ఆఫ్స్‌కి ఏమేమి వెళతాయనే దానిపై ఓ క్లారిటీ అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు ఉన్న ఆరు జట్లలో చెన్నై, ఢిల్లీ, ఆర్సీబీ జట్లు ప్రతి మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.
ఏ టీమ్ ఓడిపోయిన కూడా అది ప్లే ఆఫ్ రేసు నుండి నిష్క్రమించినట్టే. ఈ రోజు జరిగే రెండు మ్యాచ్‌లతో మూడు జట్ల భవితవ్యం తెలిసిపోతుంది. సీఎస్కే, డీసీ, ఆర్సీబీలు ఇప్పటిదాకా చెరో 12 మ్యాచ్‌లు ఆడాయి. నేటి మ్యాచుల్లో గెలిచే జట్టుకి మాత్రమే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ రోజుమ్యాచ్‌లో గెలిచి తర్వాతి మ్యాచ్ కూడా గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. ఇక సన్‌రైజర్స్, గుజరాత్, లక్నో ప్లేఆఫ్స్ అవకాశాల మీద కూడా ఈ రోజు మ్యాచ్‌లు ప్రభావం చూపుతాయి. మరి కొద్ది గంటలలో జరగనున్న రెండు మ్యాచ్‌లు చాలా ముఖ్యం కాబట్టి మిస్ కాకుండా మ్యాచ్ లు చూసి ఎంజాయ్ చేయండి