Friday, April 4, 2025
HomeInternationalAlejandra Rodríguez | 60 ఏండ్ల వ‌య‌సులో అందాల భామ కిరీటం..

Alejandra Rodríguez | 60 ఏండ్ల వ‌య‌సులో అందాల భామ కిరీటం..

బ్యూన‌స్ ఎయిర్స్‌: అందాల పోటీలు అంటే మ‌న‌కు యువ‌తులే గుర్తొస్తారు. మ‌రి 60 ఏండ్ల బామ్మ అందాల భామగా ఎలా ఎంపికైంద‌ని ఆలోచిస్తున్నారా.. అవును అందాల పోటీల్లో విజేత‌గా నిలిచేందుకు వ‌య‌సు అడ్డుకాదనే విష‌యాన్ని నిరూపిస్తూ టీనేజీ అమ్మాయిల‌తో పోటీప‌డి కిరీటాన్ని నెగ్గి చ‌రిత్ర సృష్టించారు అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌ (Alejandra Rodríguez).

అర్జెంటీనాలోని లా ప్లాటా న‌గ‌రానికి చెందిన రొడ్రిగోజ్‌ వృత్తిరీత్యా జ‌ర్న‌లిస్టు, న్యాయ‌వాది. ఇటీవ‌ల బ్యూనస్‌ ఎయిర్స్‌లో జ‌రిగిన అందాల పోటీలు జ‌రిగాయి. అందులో పాల్గొన్న ఆమె మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్ టైటిల్‌ గెలుచుకున్నారు. దీంతో అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం ద‌క్కించుకున్న‌ తొలి మహిళగా రికార్డుల్లో కెక్కారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. వ‌చ్చే నెలలో జరుగ‌నున్న ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో ఆమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే విశ్వసుందరి 2024′ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటారు. ప్ర‌స్తుతం ఈ అందాల రాణి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

గతంలో ఈ అందాల పోటీలో 18-28 ఏండ్ల‌ వయసున్న మహిళలే పాల్గొనే వీలుండేది. అయితే గ‌తేడాది వ‌యోప‌రిమితిని తొల‌గిస్తూ ‘మిస్‌ యూనివర్స్‌’ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకున్న‌ది. దీంతో 18 ఏండ్లు పైబడిన యువతులందరికీ అవకాశం కల్పిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు