Wednesday, January 1, 2025
HomeTelanganaLok Sabha Elections | తెలంగాణ‌లో 65.67 శాతం పోలింగ్ న‌మోదు.. అత్య‌ధికంగా భువ‌న‌గిరిలో..

Lok Sabha Elections | తెలంగాణ‌లో 65.67 శాతం పోలింగ్ న‌మోదు.. అత్య‌ధికంగా భువ‌న‌గిరిలో..

Lok Sabha Elections | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల తుది పోలింగ్ శాతం వివ‌రాల‌ను రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి వికాస్ రాజ్ మంగ‌ళ‌వారం రాత్రి వెల్ల‌డించారు. సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ప్ర‌శాంతంగా పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 65.67 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు తెలిపారు. 2019 ఎన్నిక‌ల‌తో పోల్చితే ఈ సారి 3 శాతం పోలింగ్ పెరిగింద‌ని చెప్పారు. అత్య‌ధికంగా భువ‌న‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 76.78 శాతం పోలింగ్ న‌మోదు కాగా, అత్య‌ల్పంగా హైద‌రాబాద్ ప‌రిధిలో 48.48 శాతం పోలింగ్ న‌మోదైంది. నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే న‌ర్సాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో అత్య‌ధికంగా 84.25 శాతం, అత్య‌ల్పంగా మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 42.76 శాతం పోలింగ్ న‌మోదైంది.

పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోలింగ్ శాతం

1. ఆదిలాబాద్ – 74.03
2. పెద్ద‌ప‌ల్లి – 67.87
3. క‌రీంన‌గ‌ర్ – 72.54
4. నిజామాబాద్ – 71.92
5. జ‌హీరాబాద్ – 74.63
6. మెద‌క్ – 75.09
7. మ‌ల్కాజ్‌గిరి – 50.78
8. సికింద్రాబాద్ – 49.04
9. హైద‌రాబాద్ – 48.48
10. చేవెళ్ల – 56.50
11. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – 72.43
12. నాగ‌ర్‌క‌ర్నూల్ – 69.46
13. న‌ల్ల‌గొండ – 74.02
14. భువ‌న‌గిరి – 76.78
15. వ‌రంగ‌ల్ – 68.86
16. మ‌హ‌బూబాబాద్ – 71.85
17. ఖ‌మ్మం – 76.09

 

RELATED ARTICLES

తాజా వార్తలు