7 విలీన మండలాలపై చలసాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.
తెలంగాణలోని ఏడు మండలాలు ఏపీలో విలీనానికి సంబంధించిన వివాదంపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారని మాట్లాడేవాళ్లు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని స్పష్టం చేశారు. ఇదీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోనే ఉందని స్పష్టం చేశారు.
ఏపీపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని చలసాని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముంపు గ్రామాలు మొత్తం ఏపీలో భాగమేనని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు ఉంటే న్యాయ నిపుణులతో కమిటీలు వేయాలని సూచించారు. ఆస్తుల పంపకాల విషయంలో పంతాలకు పోవద్దని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే అనిస్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.