Friday, January 3, 2025
HomeSportsIPL 2024| ఎస్ఆర్‌హెచ్ విజ‌యంతో ముంబై, ఆర్సీబీ క‌థ ముగిసిన‌ట్టేనా?

IPL 2024| ఎస్ఆర్‌హెచ్ విజ‌యంతో ముంబై, ఆర్సీబీ క‌థ ముగిసిన‌ట్టేనా?

IPL 2024| ప్ర‌తి ఏడాది కూడా ఐపీఎల్ క్రికెట్ ప్రేమికుల‌కి మంచి థ్రిల్ అందిస్తుంటుంది. సీజ‌న్ 17 కూడా మంచి రంజుగా సాగుతుంది. మార్చి 22న చె సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ‌ధ్య ఫైట్‌తో ఈసీజ‌న్ ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజ‌యం సాధించింది. ఇక ఈ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింద‌నే చెప్పాలి. అన్ని జ‌ట్లు కూడా 11 మ్యాచ్‌లు ఆడాయి. కొన్ని 12 ఆడాయి. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌లు ఆడగా 8 విజయాలతో 16 పాయింట్లు సంపాదించుకొని టాప్ వ‌న్‌లో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్స్ సాధించి రెండో స్థానంలో ఉంది. ఇక నిన్న రాత్రి ల‌క్నోపై సూప‌ర్ విక్ట‌రీ ద్వారా హైద‌రాబాద్ జ‌ట్టు మూడో స్థానంలోకి వ‌చ్చింది.

చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచుల్లో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్‌జెయింట్‌లు కూడా 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5, 6 స్థానాల్లో ఉన్నాయి. ఇతర జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ 8 పాయింట్లతో 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. 2022లో ఛాంపియ‌న్‌గ నిలిచిన గుజ‌రాత్ టైటాన్స్ గ‌త సీజ‌న్‌లో కూడా అద్భుతంగానే ఆడింది. ఫైన‌ల్‌లో ఓట‌మి చెందింది. అయితే ఈ సీజ‌న్ గిల్ కెప్టెన్సీలో ఆ టీం పెద్ద‌గా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం చివ‌రి స్థానంలో ఉన్న గుజ‌రాత్ ప్లే ఆఫ్స్‌కి చేర‌డం అసాధ్యం. పాయింట్ల పట్టికలో 7, 8, 9, 10 స్థానాల్లో ఉన్న జట్లకు వరుసగా 3 శాతం, పంజాబ్ కింగ్స్ 3 శాతం, గుజరాత్ టైటాన్స్ 2 శాతం, ముంబై ఇండియన్స్ 0 శాతం మాత్రమే ప్లే ఆఫ్స్‌కి వెళ్లే ఛాన్స్ ఉంది.

ఈ నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి చేరాలంటే త‌ప్ప‌కుండా అద్భుతం జ‌రిగి తీరాలి. అయితే 5వ, 6వ స్థానాల్లో ఉన్న ఢిల్లీకి ప్లేఆఫ్‌కు చేరే అవకాశం 49 శాతం ఉండగా, ల‌క్నోకి 32 శాతం అవకాశం ఉంది. ఇక టాప్‌లో ఉన్న జ‌ట్ల విష‌యానికి వ‌స్తే కోల్‌కతాకు 99 శాతం, రాజస్థాన్ రాయల్స్‌కు 97 శాతం ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కి 59 శాతం, చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి 56 శాతం అవకాశాలు ఉన్నాయి. చివ‌రి వ‌ర‌కు ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుంద‌నేది ఇప్పుడు చెప్ప‌డం కాస్త క‌ష్టంగానే ఉంది. అయితే ఎస్ఆర్‌హెచ్ విజ‌యం త‌ర్వాత ముంబై అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండ‌గా, టాప్ 4 లోని మిగ‌తా మూడు జట్లలో 2 క్వాలిఫైయర్లు, ఒక ఎలిమినేటర్ మ్యాచ్ ఆడ‌తాయి. గెలుపొందిన జట్టు 2వ జట్టుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు