Saturday, January 4, 2025
HomeNationalDiamond Ring to Voters | ఓటేస్తే డైమండ్‌ రింగ్స్‌ ఇస్తామని చెప్పి అమెరికన్‌ డైమండ్స్‌...

Diamond Ring to Voters | ఓటేస్తే డైమండ్‌ రింగ్స్‌ ఇస్తామని చెప్పి అమెరికన్‌ డైమండ్స్‌ ఇచ్చారు.!

Diamond Ring to Voters | దేశంలో సార్వత్రిక ఎన్నికల పండుగ కొనసాగుతున్నది. ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే మూడువిడుతల ఎన్నికలు ముగిశాయి. నాలుగో దశ ఎన్నికలు ఈనెల 13న జరుగనున్నాయి. అయితే, ఈ సారి పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నది. అదే సమయంలో స్వచ్ఛంద సంస్థలు సైతం ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు పలు ఆఫర్స్‌ ప్రకటించాయి.

భోపాల్‌లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఓటర్లకు స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా ఖరీదైన కానుకలను అందించారు. లక్కీ డ్రాలో నలుగురు ఓటర్లు డైమండ్ రింగ్స్‌ని గెలుచుకున్నారు. లాటరీలో గెలుచుకున్న డైమండ్స్‌ గెలుచుకున్నామన్న వారి సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు. అవి ఒరిజినల్‌ డైమండ్స్‌ కావని.. అమెరికన్‌ వజ్రాలుగా తేలింది. దాంతో వివాదం చెలరేగింది. ‘లక్కీ జ్యువెలర్స్, బైరాగర్’ పేరుతో లేబుల్‌ ఉన్న చిన్న పెట్టెల్లో రింగ్స్‌ ఇవ్వగా.. ఆ షాప్‌ యజమాని మహేశ్‌ దద్దాన్లీకి కాల్స్‌ వచ్చాయి. అయితే, ఆ ఉంగాలతో తనకు సంబంధం లేదన్నారు. అవి తాను ఇవ్వలేదని.. బాక్సులతో కప్డ వ్యాపారి సంఘం అధ్యక్షుడి ద్వారా జిల్లా అధికార యంత్రాంగం వద్దకు వెళ్లాయన్నారు.

ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. డ్రాలో విజేతలకు నకిలీ డైమండింగ్‌ ఇచ్చింది అధికార యంత్రాంగమేనన్నారు. అయితే, కలెక్టర్ భోపాల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్‌ ఇండస్ట్రీస్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటర్లకు లాటరీ ద్వారా బహుమతులను అందజేయాలని కోరారని.. తద్వారా ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పారన్నారు. అయితే, విజేతలకు ఇచ్చినవి డైమండ్‌ రింగ్స్‌ కావని.. అందులో ఉన్నవి అమెరికన్‌ డైమండ్స్‌ అని అధికార వర్గాలు సైతం అంగీకరించాయి.

కలెక్టర్‌ కౌశలేంద్ర విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఉంగరాలు ఇస్తామనడం ఓటర్లను ప్రోత్సహించేందుకు.. అయితే, రింగ్స్‌లో ఉన్నది ఒరిజినల్‌ డైమండ్‌ లేదా ల్యాబ్‌తో తయారు చేసినవా ? అనేది తాను చెప్పలేనన్నారు. వ్యాపారుల సంఘం స్పాన్నర్‌ చేసిందని.. వాటిని ఓ బహుమతిగానే చూడాలన్నారు. అయితే, ఈ విషయంలో పలువురు విజేతలు రకాలుగా స్పందించారు. తనకు వాషింగ్‌ మెషిన్‌ వచ్చిందని ఒకరు తెలిపారు. దానితో పోలిస్తే ఆ డైమండ్‌ రేటు ఎక్కువేనని.. ఆ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు