Wednesday, January 1, 2025
HomeCinemaRajinikanth| ఏంటి.. ర‌జ‌నీకాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారా.. నిర్ణ‌యం ఎలా మారింది?

Rajinikanth| ఏంటి.. ర‌జ‌నీకాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారా.. నిర్ణ‌యం ఎలా మారింది?

Rajinikanth| సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెరపై ఎన్ని రాజభోగాలు అనుభవించినా కూడా తెర వెనుక మాత్రం ఆయ‌న సాదాసీదా వ్యక్తి. కోట్లు సంపాదించిన కూడా ఆయ‌న సామాన్యుడి మాదిరిగానే ఉంటారు.. వయసు పెరుగుతున్నా స్టైల్, స్వాగ్, మ్యానరిజంలో మార్పు రావ‌డం లేదు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి చిత్రసీమను ఏలే సూపర్ స్టార్ వరకు ఆయన ప్రయాణం ఎంద‌రికో స్పూర్తి అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఆయ‌న సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన కూడా ఏ నాడు త‌న మూల‌ల‌ని మ‌ర‌చిపోలేదు. ఆ మ‌ధ్య తాను ప‌ని చేసిన బ‌స్ డిపోకి వెళ్లి పాత స్నేహితుల‌ని క‌లిసి వ‌చ్చాడు.ఆ స‌మ‌యంలో ర‌జ‌నీకాంత్‌ని స్వ‌యంగా క‌లిసిన ఆయ‌న ఫ్రెండ్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

రజనీకాంత్ అనేక దశాబ్దాలుగా ప్ర‌జ‌ల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వారి హృద‌యాల‌లో కొలువై ఉన్నారు. ఆయ‌న 1975లో అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎన్నో భాష‌ల‌లో ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించారు. ప్రస్తుతం రజనీ ఒక్క సినిమాకు 50 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నాడని, సినిమా బాగా రాక‌పోతే ఆయ‌న రెమ్యున‌రేష‌న్ వెనక్కి ఇచ్చేస్తార‌నే టాక్ ఉంది. ర‌జ‌నీకాంత్ చివ‌రిగా న‌టించిన జైల‌ర్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించి దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసింది. ప్ర‌స్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 చిత్రం చేస్తున్నారు..

సూపర్ స్టార్ రజినీకాంత్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆయ‌న బస్ కండక్టర్ అని అందరికీ తెలుసు. కాక‌పోతే ఆయ‌న‌ ఆఫీస్‌ బాయ్ , కూలీగా కూడా ప‌ని చేశార‌ట‌. ఆ తర్వాత కండక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నారు.చిన్న‌ప్ప‌టి నుండి ర‌జ‌నీకాంత్ దేనికి భ‌య‌ప‌డేవారు కాద‌ట‌. కాక‌పోతే ఒక్క‌సారి భ‌య‌ప‌డి ఆత్మహ‌త్య కూడా చేసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అయితే ఓ రోజు దేవుడికి పూజిస్తూ దేవుడి ఫొటోని చూడ‌డంతో నిర్ణ‌యం మారిపోయింద‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు త‌లైవా. అయితే అదే రాత్రి త‌న‌కి క‌ల రాగా, తెల్లటి గడ్డంతో ఉన్న ఒక వ్య‌క్తి సంతనోర్వా నదికి అవతలివైపు కూర్చుని పిలిచాడ‌ట‌. అయితే తెల్లారి ఎవ‌రు అని అడిగే అందరూ శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారు. అప్పుడు మ‌ఠానికి వెళ్లి ధ‌న‌వంతుడిని కావాల‌ని వేడుకొని ప్ర‌తి గురువారం ఉప‌వాసం ప్రారంభించాను. అనంత‌రం కండక్ట‌ర్‌గా మారడం, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయిన‌ప్పుడు బాల చంద‌ర్ గుర్తించ‌డం జ‌రిగాయి అని ర‌జ‌నీ అన్నారు

RELATED ARTICLES

తాజా వార్తలు