Saturday, January 4, 2025
HomeNationalIPPB | పోస్ట‌ల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏడాదికి వేతనం ఎంతో తెలుసా?

IPPB | పోస్ట‌ల్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏడాదికి వేతనం ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 54 పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిపదికన భ‌ర్తీ చేస్తున్న‌ది. అర్హులైన వారు మే 24వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. బీటెక్‌, బీఎస్సీ, ఎంసీఏ తదితర అర్హతల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపికైన వారికి హోదాను బట్టి గరిష్ఠంగా రూ.25లక్షల వరకు వార్షిక వేతనం చెల్లించనున్నారు.

మొత్తం పోస్టులు- 54
వీటిలో ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) 28 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) 21, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హ‌త‌లు: బీఈ లేదా బీటెక్‌, బీసీఏ, బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు ఆయా పోస్టులను బట్టి కనీసం ఏడాది నుంచి మూడేండ్ల‌ వరకు అనుభవం ఉండాలి. అసోసియేట్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 30 ఏండ్లు, కన్సల్టెంట్‌ పోస్టులకు 22 నుంచి 40 ఏండ్లు, సీనియర్‌ కన్సల్టెంట్‌కు 22 నుంచి 45 ఏండ్ల లోపువారై ఉండాలి.
వేతనం: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.10,00,000, ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్) పోస్టులకు రూ.15,00,000, ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) పోస్టుకు రూ.25,00,000.

అప్లికేష‌న్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150.
ఎంపిక విధానం: అసెస్‌మెంట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
ఎంపికైన వారు తొలుత ఢిల్లీ, ముంబై, చెన్నైలో పనిచేయాల్సి ఉంటుంది.
అప్లికేష‌న్ విధానం: ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 24
వెబ్‌సైట్‌: www.careers@ippbonline.in

RELATED ARTICLES

తాజా వార్తలు