Saturday, January 4, 2025
HomeSportsKl Rahul| కెప్టెన్సీ నుండి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్స్...

Kl Rahul| కెప్టెన్సీ నుండి త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌.. సంజీవ్ గోయెంకా ఎక్స్‌ట్రాల‌పై మాజీ క్రికెట‌ర్స్ ఫైర్

Kl Rahul| ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్‌, ల‌క్నో మ‌ధ్య జ‌రిగిన ఫైట్‌లో ల‌క్నో దారుణ‌మైన ప‌రాజ‌యం చ‌వి చూసింది. ల‌క్నోవిధించిన 166 ప‌రుగుల టార్గెట్‌ను స‌న్‌రైజ‌ర్స్ మ‌రో 10.2 ఓవ‌ర్లు మిగిలుండ‌గానే చేధించారు. ప‌ది వికెట్ల తేడాతో ల‌క్నో చిత్తుగా ఓడిపోవ‌డంతో ల‌క్నో ఫ్రాంచైజ్‌ ఓన‌ర్ సంజీవ్ గోయెంకా జీర్ణించుకోలేక‌పోయాడు. మైదానంలోనే కేఎల్ రాహుల్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. రాహుల్ అత‌నికి వివ‌రిస్తున్నా కూడా అత‌ను త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా గ‌ట్టిగా అరిచేశాడు. అయితే రాహుల్‌పై సంజీవ్ ప్ర‌వ‌ర్తించిన తీరు బాగాలేదంటూ కొంద‌రు మాజీ క్రికెట‌ర్స్ మండిప‌డుతున్నారు. కేఎల్ రాహుల్ నీ ప‌నివాడు కాదు…అత‌డు ఓ టీమిండియా క్రికెట‌ర్, అది నువ్వు తెలుసుకో అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ సంజీవ్‌ని తిట్టిపోస్తున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా చేసిన ప‌నికి కేఎల్ రాహుల్ చాలా బాధ‌ప‌డిన‌ట్టు తెలుస్తుంది. అత‌ను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఫ్రాంఛైజీ కేఎల్ రాహుల్‌ని రీటెయిన్ చేసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. సీజ‌న్ మ‌ధ్యలోనే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ నుండి త‌ప్పుకొని ఆట‌గాడిగానే కొన‌సాగుతాడ‌ని స‌మాచారం. అయితే రాహుల్ త‌న బ్యాటింగ్‌పై దృష్టి సారించ‌డానికి కెప్టెన్సీ నుండి త‌ప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేద‌ని జట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ ఓ రిపోర్ట్‌లో తెలియ‌జేసింది.

కేఎల్ రాహుల్ 2022లో పంజాబ్ కింగ్స్ నుంచి తప్పుకోగా, అప్పుడు రూ.17 కోట్ల కు లక్నో సూపర్ జెయింట్స్ అత‌నిని కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది. తొలి రెండు సీజన్లూ రాహుల్ నేతృత్వంలో టీమ్ బాగా రాణించి ప్లే ఆఫ్స్ రేసుకి వెళ్లింది. అయితే ఇప్ప‌టికీ లక్నోకు ఇప్పటికీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఆ టీమ్ మరో రెండు మ్యాచ్ లు ఢిల్లీ, ముంబైలతో ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే లక్నో 16 పాయింట్లకు చేరుకుంటుంది. ప్ర‌స్తుతం నెట్ రన్ రేట్ (-0.760) ఉండ‌గా, అది కొంచెం స‌రి చూసుకుంటే స‌రిపోతుంది. అయితే ల‌క్నో ప్లేఆఫ్స్‌కి చేరుకోవ‌డం అద్భుత‌మే అంటున్నారు మాజీలు.. ఇక రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే నికొలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అందుకునే అవ‌కాశం ఉంది.

RELATED ARTICLES

తాజా వార్తలు