Thursday, January 2, 2025
HomeTelanganaHyderabad | రేపు సాయంత్రం నుంచి హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు.. అతిక్ర‌మించారో ఇక అంతే..

Hyderabad | రేపు సాయంత్రం నుంచి హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు.. అతిక్ర‌మించారో ఇక అంతే..

Hyderabad | లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్​లో (Hyderabad) పోలీసులు ఆంక్షలు విధించారు. శ‌నివారం (ఈ నెల 11) సాయంత్రం 6 గంటల నుంచి సోమ‌వారం (14వ తేదీ) ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండ‌నున్నాయి. ఈ మేరుకు ముగ్గురు పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురికంటే ఎక్కువ మంది గుమిగూడడంపై కూడా ఆంక్షలు విధించారు. ఈ నెల 13న పోలింగ్​ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్​ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. 13వ తేదీన పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రెండు క్యూలైన్లలో ఉండాలని, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మాత్రమే ఉంటాయని చెప్పారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.

ఆంక్షలు ఇలా..

  • ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడ‌కూడ‌దు, ఒక ఇంటి నుంచి మ‌రో ఇంటికి వెళ్ల‌డానికి వీళ్లేదు.
  • మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం నిషేధం.
  • బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలకు అనుమతి లేదు.
  • వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించకూడ‌దు.
  • పోలింగ్‌ కేంద్రాలకు కిలోమీటరు దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధం.
  • ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించడంపై నిషేధం.
  • ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలి.
RELATED ARTICLES

తాజా వార్తలు