Saturday, January 4, 2025
HomeNationalEncounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 12 మంది మావోయిస్టులు మృతి

బీజాపూర్‌: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ‌ ఛ‌త్తీస్‌గఢ్‌లో వ‌రుస ఎన్‌కౌంట‌ర్లు (Encounter) జ‌రుగుతున్నాయి. ఇన్నాళ్లు ఛ‌త్తీస్‌గ‌ఢ్ (Chhattisgarh)అడ‌వుల‌ను సేఫ్‌జోన్‌గా మార్చుకున్న‌ మావోయిస్టులు ఇప్పుడు పెద్ద సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బీజాపూర్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మ‌ర‌ణించారు. గాంగ‌లూర్ అట‌వీ ప్రాంతంలో భ‌ద్రతా బ‌ల‌గాలు యాంటీ న‌క్స‌ల్స్ ఆప‌రేష‌న్‌లో భాగంగా గ‌స్తీ నిర్వ‌హిస్తుండ‌గా కాల్పులు జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎన్​కౌంటర్​ స్థలం నుంచి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

బీజాపూర్ ఎన్‌కౌంట‌ర్‌ను సీఎం విష్ణు డియో సాయ్ (CM Vishnu Deo Sai) ధృవీక‌రించారు. బీజాపూర్ జిల్లా గాంగ‌లూర్ ప్రాంతంలో జ‌రిగిన ఎదురుకాల్లో 12 మంది మ‌ర‌ణించార‌ని, వారి మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఈ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్న జ‌వాన్లు, సీనియ‌ర్ అధికారుల‌ను అభినందించారు.

ఈ ఎన్‌కౌంట‌ర్‌తో ఈ ఏడాది ఇప్పటివ‌ర‌కు 100 మందికిపైగా మావోయిస్టులు మ‌ర‌ణించారు. ఏప్రిల్‌ 30న బ‌స్త‌ర్ రీజియ‌న్‌లోని అబూజ్‌మ‌డ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చ‌నిపోయారు. వారిలో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. అంత‌కుముందు కాంకేర్ జిల్లాలోని జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

 

RELATED ARTICLES

తాజా వార్తలు