Saturday, January 4, 2025
HomeTelanganaKCR | బండి సంజ‌య్ మాట్లాడితే ఏమైనా అర్థ‌మైత‌దా ?.. కేసీఆర్ సెటైర్లు

KCR | బండి సంజ‌య్ మాట్లాడితే ఏమైనా అర్థ‌మైత‌దా ?.. కేసీఆర్ సెటైర్లు

సిరిస‌ల్ల: కాంగ్రెస్ పార్టీ అర‌చేతిలో వైకుంఠం చూపించి, నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక్క హామీ కూడా అమ‌లు చేయ‌లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. ఉచిత బ‌స్సు ఒక‌టి అమ‌లైంది, ఆడోళ్లు స‌ర్కాస్ మాదిరి త‌న్నుకుంటున్నారు. ఆటో రిక్షా కార్మికులు అన్న‌మోరామ‌చంద్ర అని ఏడుస్తున్నారు. రైతుబంధు రాలేదు. నీళ్లు రాలేదు. క‌రెంట్ రాలేదు. మ‌ర‌మ‌గ్గాలు మూల‌ప‌డే ప‌రిస్థితి. చేనేత కార్మికులు చ‌నిపోయే ప‌రిస్థితి. ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయ‌లేదు. మీ అంద‌రూ ఆలోచించి ఓటేయాలి.. ఆగ‌మాగం వేయొద్దు. ఏ ప‌థ‌కం అమ‌లు చేయ‌కుండా మ‌ళ్లీ ఓట్లు అడుగుతున్నారు. యువ‌కులు, విద్యార్థులు, ర‌చ‌యితలు, మేధావులు ఆలోచించి ఓటేయాలి. వెర్రి ఆవేశం కాదు. నిదానంగా ఆలోచించి ఓటేయాలి.

టెక్స్ టైల్ పార్కు కావాలంటే మోదీ ఇవ్వ‌లే..

చేనేత‌లు చ‌నిపోతుంటే బాధ ప‌ట్ట‌లేక‌ పార్టీ నుంచి 50 ల‌క్ష‌లు తీసుకొచ్చి ఒక ట్ర‌స్టు ఏర్పాటు చేసి బ‌త‌మ‌ని చెప్పారు. కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో అనేక స్కీమ్‌లు పెట్టుకున్నాం. సిరిసిల్ల‌కు టెక్స్ టైల్ పార్కు కావాలంటే మోదీ ఇవ్వ‌లేదు. ఉన్నంతలో బ‌తుక‌మ్మ చీర‌లు, స్కూల్ యూనిఫాంలు ఆర్డ‌ర్లు ఇచ్చి కాపాడుకున్నాం. ఈ స‌ర్కార్ అన్ని బంద్ పెడుతున్నాయి. బ‌కాయిలు ఇవ్వ‌డం లేదు. రంజాన్ తోఫా రాలేదు.

రైతు సోద‌రుల‌కు మ‌న‌వి. రైతుబంధు ఇచ్చేందుకు వెనుకాడిన ఈ ప్ర‌భుత్వం ధాన్యం కొంట‌లేదు. క‌ల్లాల్లో ధాన్యం త‌డిసిపోయినా కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మీరంతా ఆలోచించి ఆవేశంతో కాకుండా ఓటేయాలి. వినోద్ కుమార్ చ‌దువుకున్న వ్య‌క్తి. పార్ల‌మెంట్‌లో మ‌న కోసం కొట్లాడే వ్య‌క్తి. ఎంపీ సీట్ల‌లో మ‌న‌దే మెజార్టీ, వినోద్‌కు భారీ మెజార్టీ ఇవ్వాలి. బండి సంజ‌య్‌కు, వినోద్‌కు ఏమైనా పోలిక ఉందా..? సంజ‌య్ మాట్లాడితే ఏమైనా అర్థ‌మైత‌దా..? ఆయ‌న మాట్లాడే భాష హిందా.. ఇంగ్లీషా.. తెలుగా..? తెలంగాణ కోసం 2001 నుంచి వినోద్ పోరాడారు. ఒక అడ్వ‌కేట్. సిరిసిల్ల రాజేశ్వ‌ర్ రావు మేన‌ల్లుడే వినోద్ కుమార్. మీ అంద‌ర్నీ కోరుతున్నా.. కాంగ్రెస్ తెలంగాణ‌ను అవ‌మానిస్తే ఎంపీకి రాజీనామా చేశాను. నాకు చ‌ద్ది క‌ట్టి రెండున్న‌ర ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. నాడు ఈ క‌రీంన‌గ‌ర్ గ‌డ్డ తెలంగాణ ఉద్య‌మ గౌర‌వాన్ని కాపాడింది. ఈ టైంలో కూడా తెలంగాణ గౌర‌వాన్ని, గులాబీ జెండా గౌర‌వాన్ని కాపాడాల‌ని కోరుతూ వినోద్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కోరుతున్నా.

ఈ జిల్లా ఉండాల్నా పోవాల్నా..

సిరిసిల్ల జిల్లా ర‌ద్దు చేస్తా అని రేవంత్ అంటుండు. ఈ జిల్లా ఉండాల్నా పోవాల్నా..? సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్ కుమార్ గెల‌వాలి. రేపు తీసేస్తామంటే అడ్డం ప‌డి కొట్లాడేటోడు, యుద్ధం చేసేటోడు కావాలి. మీరు నాకు బ‌లాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లాను కాపాడే బాధ్య‌త నాది. ఎంత‌కైనా యుద్ధం చేద్దాం. సిరిసిల్ల జిల్లాను, గోదావ‌రిని, నేత కార్మికుల‌ను కాపాడుకోవాల‌న్నా వినోద్ కుమార్‌ను గెలిపించాలి.

RELATED ARTICLES

తాజా వార్తలు