Wednesday, January 1, 2025
HomeCinemaSamantha| స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌ని ఉందా.. అయితే వెంట‌నే ఇలా అప్లై చేసుకోండి..!

Samantha| స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌ని ఉందా.. అయితే వెంట‌నే ఇలా అప్లై చేసుకోండి..!

Samantha| టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన స‌మంత కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో మయోసైటిస్ వ్యాధి బారిన ప‌డింది. దీంతో ఏడాది పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. చివ‌రిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఖుషీ అనే సినిమా చేసింది. ఈ సినిమా మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ త‌ర్వాత స‌మంత సినిమాల‌కి దూరంగా ఉంటూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు స‌మంత ఆరోగ్యం రిక‌వ‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టింది. నిర్మాత‌గా కూడా మారింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ నిర్మాణంలో తొలి ప్రాజెక్ట్‌గా మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ చేస్తుంది. ఈ మూవీ లేడి ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో స‌మంత‌నే లీడ్ రోల్ పోషిస్తుంది.

స‌మంత బ‌ర్త్ డే రోజు విడుదలైన పోస్ట‌ర్‌లో ఎర్ర చీర కట్టుకొని, చేతిలో తుపాకీ పట్టుకొని వీరనారి గెటప్ లో అంద‌రి మైండ్ బ్లాక్ చేసింంది సామ్. గ‌తంలో స‌మంత చేసిన లేడి ఓరియెంటెడ్ చిత్రాలు శాకుంత‌లం నిరాశ‌ప‌ర‌చ‌గా, య‌శోద ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు త‌న నిర్మాణంలో చేస్తున్న మూవీతో మంచి హిట్ కొడుతుందా లేదా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు స‌మంత..హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ గా ఓ మూవీ చేయ‌గా, ఆ చిత్రం కూడా త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే స‌మంత ఒక‌వైపు న‌టిగా కొన‌సాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది.

సాకి పేరుతో సమంత గార్మెంట్ బ్రాండ్ నిర్వహిస్తుండ‌గా, అప్పుడప్పుడు ఆ గార్మెంట్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆ సంస్థ‌లో ప‌ని చేసేందుకు ఉద్యోగ ప్ర‌కటన చేసింది స‌మంత‌. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్, ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్, బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కొరకు అర్హులైన అభ్య‌ర్ధులు ప్రకటనలో పొందు పరిచిన ఈ మెయిల్ అడ్రస్ కి వివరాలు పంపాలని చెప్పుకొచ్చింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మీకు ఆయా అర్హ‌త‌లు ఉంటే వెంట‌నే స‌మంత పంపిన మెయిల్‌కి మీ వివ‌రాలు పంపి స‌మంత దగ్గ‌ర జాబ్ కొట్టేయండి.

RELATED ARTICLES

తాజా వార్తలు