Saturday, January 4, 2025
HomeCinemaShakeela|న‌న్ను ప‌రాయి వాళ్ల ప‌క్క‌లోకి పంపి అమ్మ‌, అక్క మొత్తం దోచేశారు.. బాధని త‌ల‌చుకుంటూ ఏడ్చిన...

Shakeela|న‌న్ను ప‌రాయి వాళ్ల ప‌క్క‌లోకి పంపి అమ్మ‌, అక్క మొత్తం దోచేశారు.. బాధని త‌ల‌చుకుంటూ ఏడ్చిన ష‌కీలా

Shakeela| ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌ని సైతం ప‌క్క‌కు నెట్టి ఓ వెలుగు వెలిగింది అందాల తార ష‌కీలా. ఆమె సినిమాల‌కి ఒక‌ప్పుడు చాలా డిమాండ్ ఉండేది. త‌ర్వాత త‌ర్వాత ఆమె సినిమాల‌కి దూర‌మై అప్పుడ‌ప్పుడు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో, షోల‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తూ ఉంటుంది. ష‌కీలా ఈ మ‌ధ్య బిగ్ బాస్ షోలో కూడా క‌నిపించి సంద‌డి చేసింది. అయితే ష‌కీలా ప‌లు సంద‌ర్భాల‌లో తన క‌ష్టాల గురించి చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కుటుంబ స‌భ్యుల నుండి ఆమెకి ఎలాంటి స‌హ‌కారం లేక‌పోవ‌డంతో ఎన్నో క‌ష్టాల‌ని చ‌వి చూసింది. తాజాగా ఆమె జీవితాన్నిదృశ్య రూపంలో చూపించి అంద‌రు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యేలా చేశారు.

ఈ రోజు మదర్స్ డే సందర్భంగా స్టార్ మాలో లవ్ యు అమ్మా అనే ఒక షోని ప్లాన్ చేశారు. ఈ షోకి యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి హోస్ట్‌లు ఉండ‌గా, ఇందులో జబర్దస్త్ రోహిణి, భానుశ్రీ, బుల్లితెర నటుడు మానస్ తదిత‌రులు వారి తల్లులతో ఈ షోలో పాల్గొన్నారు. ష‌కీలా కూడా షోలో సంద‌డి చేసింది. అంద‌రు త‌ల్లుల‌కి సంబంధించిన జ్ఞాప‌కాలు పంచుకోగా, చివ‌రిలో ష‌కీలా జీవితాన్ని దృశ్య రూపంగా చూపించారు. త‌న జీవితం ఎంత దుర్భ‌రంగా ఉందో స్క్రీన్‌పై చూసి వెక్కి వెక్కి ఏడ్చింది. సొంత తోబుట్టువు అక్కని నమ్మి ఎలా షకీలా మోసపోయింది , కుటుంబ స‌బ్యుల వ‌ల‌న త‌ను ఎలాంటి బాధ‌లు ప‌డింది వంటివి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు.

సినిమాల ద్వారా ష‌కీలా చాలా డ‌బ్బు సంపాదించ‌గా, దానిని ఆమె అక్క మోసం చేసి ఎలా తీసుకుంది, ఒంట‌రిగా మారిన స‌మ‌యంలో టాన్స్ జెండర్స్ తనని అమ్మగా ఎలా స్వీకరించారో కూడా చూపించారు. ఆ దృశ్యాలకు షకీలా ఎమోషనల్ అవుతూ క‌న్నీరు పెట్టుకుంది. ఈ ప్రోమో ఎంత‌గానో ఆక‌ట్టుకోగా, షకీలా జీవితం ఇలా ఉందా అంటూ కొంద‌రు క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇక మదర్స్ డే సందర్భంగా బుల్లితెర హీరో మానస్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆడపిల్లల చదువు కోసం కొంత మొత్తం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వీడియో ఆక‌ట్టుకుంటుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు