Sunday, December 29, 2024
HomeCinemaAllu Arjun| ఉద‌యాన్నే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వారు ఏమ‌న్నారంటే..!

Allu Arjun| ఉద‌యాన్నే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్.. వారు ఏమ‌న్నారంటే..!

Allu Arjun| తెలంగాణలో ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలీగ్ ప్రారంభ‌మైంది. రాష్ట్రంలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ స‌జావుగానే సాగుతుంది. ఓట‌ర్లు అంద‌రు కూడా త‌మ ఓటు హ‌క్కుని వినియోగించేందుకు బూత్‌ల‌కి వెళుతున్నారు. కొన్నిపోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు. ఇక పోలింగ్ బూత్‌ల ద‌గ్గ‌ర ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఇక సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఉదయాన్నే వెళ్లి త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు

తల్లి, సతీమణితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అంద‌రితో క‌లిసి లైన్‌లో నిలుచున్న ఎన్టీఆర్ త‌న వంతు వ‌చ్చిన‌ప్పుడు వెళ్లి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఇది మనం రాబోయే తరాలకు అందించాల్సిన మంచి సందేశమని నేను భావిస్తున్నాను అంటూ జూనియ‌ర్ ఎన్టీఆర్ తెలిపారు.

ఇక అల్లు అర్జున్ సైతం ఉద‌యాన్నే వెళ్లి ఓటు వేశారు. ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్‌..క్యూలో నిలుచొని వెళ్లి మ‌రీ ఓటు వేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. “దయచేసి మీ ఓటు హ‌క్కు వినియోగించుకోండి. ఇది దేశ పౌరులందరి బాధ్యత. రాబోయే 5 సంవత్సరాల కోసం ఈ రోజు అత్యంత కీలకమైన రోజు. ఎక్కువ మంది ప్రజలు ఓటు వేయడానికి వస్తున్నందున భారీ ఓటింగ్ న‌మోదు అవుతుంద‌ని నేను భావిస్తున్నాను అని అన్నారు బ‌న్నీ.

RELATED ARTICLES

తాజా వార్తలు