Friday, January 3, 2025
HomeSportsRCB | ఆ సెంటిమెంట్ ప్ర‌కారం చూస్తే.. ఫైన‌ల్లో ఆర్సీబీ రావ‌డం ప‌క్కా

RCB | ఆ సెంటిమెంట్ ప్ర‌కారం చూస్తే.. ఫైన‌ల్లో ఆర్సీబీ రావ‌డం ప‌క్కా

RCB | ఐపీఎల్ 2024 సీజన్ లో 62 మ్యాచ్‌లు ముగిసాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మినహా మరే జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌లేదు. ఒక్క అడుగుదూరంలో . సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ ఉండ‌గా, వాటి మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఆదివారం రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌లు జ‌ర‌గగా, వాటిలో చెన్నై, ఆర్సీబీ విజ‌యాలు సాధించి ప్లే ఆఫ్ అవ‌కాశాలు మెరుగుప‌ర‌చుకుంది.ప్రస్తుతం టేబుల్ కేకేఆర్ టాప్‌లో ఉండ‌గా, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా టాప్-4లో ఉన్నాయి.. ఆ త‌ర్వాతి స్థానాల‌లో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.

అయితే టోర్నీ మొద‌ట్లో వ‌రుస ప‌రాజ‌యాలు చ‌విచూసిన ఆర్సీబీ జ‌ట్టు ఇప్పుడు పుంజుకుంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ మ్యాచ్ మ్యాచ్‌కి ప్లే ఆఫ్స్‌కి ద‌గ్గ‌ర అవుతున్నారు. ప్ర‌స్తుతం ఆర్సీబీ 12 పాయింట్ల‌తో 0.387 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ జ‌ట్టు చివ‌రి మ్యాచ్‌లో చెన్నైతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజ‌యం సాధించ‌డమే కాదు 18 ప‌రుగుల తేడాతో గెల‌వాలి. లేదంటే సీఎస్‌కే విధించిన ల‌క్ష్యాన్ని 18.1 ఓవ‌ర్ల‌లోనే చేధించాల్సి ఉంటుంది. అలా అయితేనే చెన్నై క‌న్నా మెరుగైన రన్‌రేట్ సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది ఆర్సీబీ జ‌ట్టు. ఇది కుద‌రలేదంటే సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవ‌ల్సి ఉంటుంది.

అయితే ఓ సెంటిమెంట్ ప్ర‌కారం ఆర్సీబీ ఫైన‌ల్ చేరుతుంద‌ని అంటున్నారు. ఆర్‌సీబీ వరుసగా విజయాలు సాధించినప్పుడల్లా ఫైనల్ చేరింది. 2011 సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా 7 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది. ఫైన‌ల్‌లో ఓడి ర‌న్న‌ర‌ప్‌గా మిగిలింది. ఇక 2009 సీజన్‌లో వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ వ‌ర‌కు వెళ్లింది. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్ స్థానంలో ఉంది. 2010, 2021లో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది కాని టైటిల్ అందుకోవ‌డంలో వెన‌క‌ప‌డింది. అయిత ఈ స్టాట్స్ ప్ర‌కారం చూస్తే ఆర్సీబీ ఈ ఏడాది వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ సారి కూడా ఫైన‌ల్ వ‌ర‌కు పోతుంద‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు