Wednesday, January 1, 2025
HomeTelanganaLok Sabha Polling | ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌

Lok Sabha Polling | ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ (Lok Sabha Elections) ప్రశాంతంగా కొనసాగుతున్నది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్‌ జరుగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌ నమోదయింది. మహబూబ్‌నగర్‌లో 26.99 శాతం, మెదక్‌లో 28.32 శాతం, నాగర్‌కర్నూల్‌లో 27.74 శాతం, నల్లగొండలో 31.21 శాతం, నిజామాబాద్‌లో 28.26 శాతం, పెద్దపల్లిలో 26.17 శాతం, వరంగల్‌లో 24.18 శాతం, జహీరాబాద్‌లో 31.83 శాతం ఓటింగ్‌ నమోదయింది. ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికలో 16.34 శాతం పోలింగ్‌ రికార్డయింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 11 గంటల వరకు లోక్‌సభకు 23.10 శాతం, అసెంబ్లీ ఎన్నికలకు 23 శాతం ఓటింగ్‌ నమోదయింది.

RELATED ARTICLES

తాజా వార్తలు