Sunday, December 29, 2024
HomeNationalRahul Gandhi | త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాలి.. రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Rahul Gandhi | త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోవాలి.. రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Rahul Gandhi | ల‌క్నో : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు రాహుల్ గాంధీ త‌న పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాయ్‌బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌చారంలో భాగంగా రాయ్‌బ‌రేలిలో సోమవారం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పెళ్లి గురించి ఆడియ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌కు రాహుల్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు.

ఇప్పుడిక త్వ‌ర‌లో నేను పెళ్లి చేసుకోవాలి అని రాహుల్ గాంధీ బ‌దులిచ్చారు. రాహుల్ స‌మాధానం విని ప‌క్క‌నే ఉన్న సోద‌రి ప్రియాంక గాంధీ స‌హా మిగిలిన వారు చిరున‌వ్వులు చిందించారు. గ‌తంలో రాజ‌స్థాన్‌లోని మ‌హారాణి కాలేజీ విద్యార్థినుల‌తో భేటీ సంద‌ర్భంగా.. మీరు స్మార్ట్‌గా, అందంగా ఉంటారు. పెళ్లి గురించి ఎందుకు ఆలోచించ‌లేదు అని అని రాహుల్‌ను అడిగారు. త‌న ప‌నుల్లో, పార్టీ వ్య‌వ‌హారాల్లో పూర్తిగా నిమ‌గ్న‌మైనందునే వివాహం వైపు వెళ్ల‌లేద‌ని వారికి స‌మాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ.

RELATED ARTICLES

తాజా వార్తలు