Bear Bike Ride | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వస్తుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఎలుగుబంటి బైక్ రైడ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. బైక్‌పై వీధుల్లో షికారు కొడుతున్నది. అంతే కాకుండా రోడ్డుపై కనిపించిన అందరికీ హాయ్ చెబుతూ ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం ఎలుగుబంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది.
ఈ ఘటన రష్యాలో చోటు చేసుకున్నది. ఆర్కెంగెలిస్క్ ప్రాంతంలో జరిగింది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను షూట్ చేశాడు. అయితే, ఇది పాత వీడియోనే కానీ మరోసారి వైరల్ అవుతున్నది. యూపీఐ న్యూస్ కథనం ప్రకారం.. ఆ వీడియోలోని ఎలుగుబంటి పేరు టిమ్. అది ఓ సర్కస్ కంపెనీలో ఉంటుంది. సర్కర్‌లో అలసిపోయిన సమయంలో ఆ ఎలుగుబంటిని దాని ట్రైనర్ బైక్‌కు పక్కనే ఉండే సైడ్ కార్‌లో కూర్చుండబెట్టి వీధుల్లో తిప్పుతుంటాడు.
అయితే, ఎలుగుబంటి దాడి చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదని సర్కస్ నిర్వాహకుడు ఒకరు చెప్పారు. భద్రతపై అధికారులతో సమన్వయం చేసుకున్నాకే ఎలుగుబంటిని ఎప్పుడో ఒకసారి అలా బైక్ రైడింగ్‌కి తీసుకెళ్తామని వివరించారు. న్యాచులర్ అమేజింగ్ ఎక్స్ అకౌంట్‌లో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇప్పటి వరకు 12.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరి మీరూ ఆ వీడియో చూసేయండి..!
A bear riding in a motorcycle sidecar waving to people.
Just a normal day in Russia… pic.twitter.com/SjHn6J8YyG
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 13, 2024