Saturday, January 4, 2025
HomeNationalRTC Bus | ఆర్టీసీ బ‌స్సులో యువ జంట రొమాన్స్‌.. అంతా చూస్తుండ‌గానే..

RTC Bus | ఆర్టీసీ బ‌స్సులో యువ జంట రొమాన్స్‌.. అంతా చూస్తుండ‌గానే..

న్యూఢిల్లీ: వాళ్లు కిక్కిరిసిన‌ ఆర్టీసీ బ‌స్సులో (RTC Bus) ప్ర‌యాణిస్తున్నారు. బ‌స్సులో చివ‌రి వ‌రుస‌లో కిటికీ వ‌ద్ద కూర్చున్నారు. ఒకే సీట్లో కూర్చున్న ఇద్ద‌రు మెల్ల‌గా రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లారు. జ‌నాల మ‌ధ్య ఉన్న విష‌యం మ‌ర్చిపోయి అంతా చూస్తుండ‌గానే ముద్దులు పెట్టుకున్నారు. ఈ త‌తంగాన్నంతా వారి ముందు సీట్లో కూర్చున్న ఓ వ్య‌క్తి త‌న ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఒడిశాలోని రూర్కెలాలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

అయితే అది ఢిల్లీలో జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ.. ఒడిశాలోని రూర్కెలాలో ఆర్టీసీ బ‌స్సులో చోటుచేసుకున్న‌ది. ప్ర‌యాణికుల‌తో ర‌ద్దీగా ఉన్న బ‌స్సులో ఎక్కిన ఆ యువ జంట‌.. చివ‌రి సీట్‌లో కూర్చుని రొమాన్స్ చేశారు. వారి ప‌క్క‌కే ఓ వృద్ధురాలు కూడా కూర్చుని ఉన్న‌ది. అదేవిధంగా వారి సీటు ప‌క్క‌నే కండ‌క్ట‌ర్ కూడా నిల‌బ‌డి ఉన్నాడు. చిన్న‌పిల్ల‌లు మ‌హిళ‌ల‌తో కిక్కిరిసిన బ‌స్సులో వారు అలా చేయ‌డంతో నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు