Saturday, January 4, 2025
HomeCinemaFaima| వామ్మో.. ఫైమా త‌క్కువ‌ది కాదు.. ప్ర‌వీణ్‌తో కాకుండా మ‌రో ఇద్ద‌రి జీవితాల‌తో ఆడుకుందిగా..!

Faima| వామ్మో.. ఫైమా త‌క్కువ‌ది కాదు.. ప్ర‌వీణ్‌తో కాకుండా మ‌రో ఇద్ద‌రి జీవితాల‌తో ఆడుకుందిగా..!

Faima| బుల్లితెర లేడీ క‌మెడీయ‌న్ ఫైమా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘ప‌టాస్’ షోతో బుల్లితెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ అమ్మ‌డు షోలో త‌న కామెడీ టైమింగ్, పంచ్ లు, యాక్టింగ్ తో ప్ర‌తి ఒక్క‌రికి మంచి వినోదం పంచింది.ఇక ఆ త‌ర్వాత జ‌బ‌ర్ధ‌స్త్ షోలో పాల్గొని ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలో కూడా ఫైమా పాల్గొంది. మ‌గాళ్ల‌కి ధీటుగా పోరాడి టాప్ 5 వ‌ర‌కు చేరుకుంది. హౌజ్‌లో ఉన్న‌న్ని రోజులు ఆద్యంతం నవ్వులు పూయించి ర‌క్తి క‌ట్టించింది. బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఫైమా స్టార్ మాలో ప‌లు షోస్ చేస్తూ సంద‌డి చేస్తుంది.ఇక ఇప్పుడు తిరిగి జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి వ‌చ్చింది. తెగ సంద‌డి చేస్తూ అల‌రిస్తుంది.

అయితే ఈ అమ్మ‌డి ప్రేమ వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మరో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్‌తో కలిసి ప్రేమ‌లో మునిగి తేలిన ఆమె త‌న జీవితంలో అత‌డు ఎంతో స‌పోర్ట్ ఇచ్చాడ‌ని పేర్కొంది. అయితే ఇటీవ‌ల ఈ జంట ప‌లు కార‌ణాల వ‌ల‌న విడిపోయిన‌ట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ఫైమా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తమ మధ్య కొన్ని సమస్యలున్నాయని, వాటి కారణంగా విడిపోయామ‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం తాము ఇద్ద‌రం మాట్లాడుకోవ‌డం లేద‌ని, స‌మ‌స్య‌ల గురించి ఎక్క‌డ చెప్ప‌డం లేద‌ని, అవి బ‌య‌ట‌కు చెబితే పెద్ద గొడ‌వ‌లు అవుతాయ‌ని కూడా పేర్కొంది.

అయితే తర్వాత ఓ సంద‌ర్భంలో క‌మెడీయ‌న్ భాస్క‌ర్.. జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి ఎలా వచ్చారని అడిగాడు. దానికి న‌రేష్ రేషన్‌ కోటా లెక్కలు చెప్పి నవ్వించాడు . ఈ క్రమంలో ఫైమా ముగ్గురు జీవితాలతో ఆడుకుందని నరేష్‌ కామెంట్‌ చేయడంతో అంద‌రు నోరెళ్ల‌పెట్టారు. ఫైమా కూడా ఒకింత ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అందరు కూడా ఫైమా విష‌యంలో తెగ ఆలోచ‌న‌లు చేస్తున్నారు. మ‌న‌కు తెలిసిన లెక్క ప్ర‌కారం ఫైమా.. ప్ర‌వీణ్‌తోనే ఆడుకుంది. మ‌రి మిగ‌తా ఇద్ద‌రు ఎవ‌రు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కామెడీ యాంగిల్‌లోనే భాగంగా న‌రేష్ చెప్పుకు రావ‌డం కొస‌మెరుపు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైర‌ల్‌గా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు