Wednesday, January 1, 2025
HomeHealthAcidity | కడుపులో మంటా.. ఈ చిట్కాలు పాటించి తగ్గించుకోండి..|

Acidity | కడుపులో మంటా.. ఈ చిట్కాలు పాటించి తగ్గించుకోండి..|

Acidity | ఎసిడిటీ ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వస్తే దీన్నే ఎసిడిటీ ఉంటుంది. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. తీవ్రమైన ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ మంట ఏమి తిననివ్వదు.. తిన్నా సహించదు. అయితే, ఈ సమస్యకు పలు కారణాలున్నాయి. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను బయటపడొచ్చు.

  • క‌ప్పు గోరు వచ్చని నీళ్లలో కొద్దిగా వాము పొడితో పాటు కొద్దిగా నల్ల ఉప్పును కలిపి తీసుకోవాలి. దీన్ని నిత్యం రెండుసార్లు తాగుతుంటే కడుపులో మంట నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది.
  • గ్యాస్‌ గోరువచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల తేనెను కలిపి ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర గంట ముందు తీసుకోవాలి. తేనె సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. దాంతో క‌డుపులో మంట త‌గ్గుతుంది.
  • గ్లాస్ నీటిలో రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించి, ఆ తర్వాత వడకట్టి గోరువచ్చగా ఉన్న సమయంలో తాగాలి. ఈ నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. ఇలా చేస్తే కడుపులో మంట తగ్గుతుంది.
  • రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ చల్లని పాలను తాగాలి. పాలను బాగా మరించి అనంతరం వాటిని చల్లార్చి కాసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. అనంతరం వాటిని నిద్రకు కొద్ది నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా మూడు రోజుల పాటు వరుసగా చేస్తే ఎసిడిటీ తగ్గుతుంది.
  • ప్రతి రోజు మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు గుప్పెడు సోంపును నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి. ఇలా చేస్తుంటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా క‌డుపులో మంట నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
RELATED ARTICLES

తాజా వార్తలు