Sunday, December 29, 2024
HomeCinemaTheatres | సినిమా థియేటర్ల బంద్‌పై స్పందించిన ఫిలిం ఛాంబర్‌

Theatres | సినిమా థియేటర్ల బంద్‌పై స్పందించిన ఫిలిం ఛాంబర్‌

Theatres | వేసవి సెలవుల్లో థియేటర్ల బోసిపోతున్నాయి. ఈ సీజన్‌లో బడా స్టార్‌ హీరోల సినిమాలు ఒక్కటీ విడుదలకాలేదు. దాంతో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొనసాగుతున్నది. దాంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు సైతం జరిగాయి. దాంతో థియేటర్లకు వచ్చే వారి సంఖ్య భారీగా పడిపోయింది. ముఖ్యంగా సింగిల్‌ థియేటర్ల రాబడి భారీగా తగ్గిపోయింది. ఈ క్రమంలో నిర్వహణ ఖర్చులు భరించలేక రాష్ట్రవ్యాప్తంగా సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను పదిరోజులు మూసివేయనున్నట్లు నిర్ణయించారు. తాజాగా థియేటర్ల మూసివేతపై ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని చెప్పింది. నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్లు తమను సంప్రదించలేదని ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది. థియేటర్ల మూసివేత నిర్ణయంతో తమకు సంబంధం లేదని చెప్పింది. పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు