Friday, January 3, 2025
HomeCinemaJanhvi Kapoor | కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్‌..!

Janhvi Kapoor | కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్‌..!

Janhvi Kapoor | బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ నటి విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో జాన్వీ కపూర్‌ బిజీబిజీగా ఉన్నది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నిన్న రిలీజ్ విడుదలవగా.. మంచి రెస్పాన్స్‌ వస్తున్నది. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో జాన్వీకి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దాంతో కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పగలరా? ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ తన కలలను ఆయన తన భర్త కలలుగా భావించేవాడు కావాలని చెప్పింది. తనకు ఎప్పుడూ అండగా నిలవాలని, ఎల్లప్పుడూ సంతోషాన్ని పంపాలని చెప్పింది. తనను ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలని.. తాను ఏడ్చినప్పుడు పక్కనే ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పింది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్‌ ప్రస్తుతం శిఖర్‌ పహారియాతో డేటింగ్‌లో ఉన్నది. ఇద్దరూ జంటగా ఇటీవల తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. పెళ్లి కూడా తిరుమలలో.. చాలా సింపుల్‌గా జరుగుతుందని గతంలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జాన్వీ కపూర్‌ దోస్తానా-2, ఉలాజ్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే, తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌కు జోడీగా దేవర చిత్రంలో నటిస్తున్నది. ఈ ఏడాది అక్టోబర్‌ 10న ఈ మూవీ విడుదలకానున్నది.

RELATED ARTICLES

తాజా వార్తలు