Saturday, January 4, 2025
HomeCinemaAnushka Shetty| ఏజ్ బార్ నిర్మాత‌తో పెళ్లికి సిద్ధ‌మైన అనుష్క‌..ఇన్నాళ్లు వెయింట్ చేసింది ఆయ‌న కోస‌మేనా?

Anushka Shetty| ఏజ్ బార్ నిర్మాత‌తో పెళ్లికి సిద్ధ‌మైన అనుష్క‌..ఇన్నాళ్లు వెయింట్ చేసింది ఆయ‌న కోస‌మేనా?

Anushka Shetty| టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి ఒక‌రు. మొద‌ట్లో గ్లామ‌ర్ రోల్స్ చేసి మెప్పించిన అనుష్క ఆ త‌ర్వాత లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో అద‌ర‌గొట్టింది. స్టార్ హీరోల‌ని మించిన పేరు ప్ర‌ఖ్యాత‌లు కూడా అనుష్క సాధించింది. ఈ అమ్మ‌డు బాహుబలి సినిమాతో నేష‌న‌ల్ వైడ్ క్రేజ్ ద‌క్కించుకుంది. అనుష్క స్థాయిని మ‌రింత‌గా పెంచిన చిత్రాల‌లో అరుంధ‌తి గురించి ముందుగా చెప్పుకోవాలి. ఇందులో జేజెమ్మ‌గా అనుష్క త‌న న‌ట విశ్వ‌రూపం చూపించింది.ఈ సినిమా త‌ర్వాత‌నే అనుష్క రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఇక అనుష్క త‌న కెరీర్‌లో ప‌లు సాహ‌సాలు కూడా చేసింది.

‘బాహుబలి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో సైజ్ జీరో అనే సినిమా చేసింది అనుష్క‌. ఇందులో లావుగా క‌నిపించాల‌ని భారీగా బ‌రువు పెరిగింది. దాంతో ఆమెకి అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తాయి. ఆ బ‌రువు త‌గ్గేందుకు అనుష్క ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్నా కూడా త‌గ్గ‌డం లేదు. అయితే అప్ప‌టి నుండే అనుష్క కాస్త సినిమాలు కూడా త‌గ్గించింది. ఇటీవ‌ల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో క‌నిపించి సంద‌డి చేసింది. ఇక ఇప్పుడు ‘ఘాటి’ అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే అనుష్క వ‌య‌స్సు నాలుగు ప‌దులు దాటిన ఈ అమ్మ‌డు పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు.

ఆమె తోటి వ‌య‌స్సు ఉన్న భామ‌లు అంద‌రు పెళ్లిళ్లు చేసుకోగా అనుష్క పెళ్లి గురించి మాట్లాడ‌డం లేదు. కాని సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమె పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హల్‌చ‌ల్ చేస్తుంటాయి. తాజాగా అనుష్క కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాతతో వివాహానికి సిద్ధం అయిన‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. త్వ‌ర‌లోనే అత‌నితో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకోనుంద‌ని, ఏడాది త‌ర్వాత వారిరివురు ఏడ‌డుగులు వేయ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం నిర్మాత‌కి 42 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంద‌ని, అత‌నితో ఎప్ప‌టి నుండో అనుష్క‌కి ప‌రిచ‌యం ఉంద‌ని, పెద్ద‌ల అంగీకారంతో వారిరివురు వివాహం చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం.

RELATED ARTICLES

తాజా వార్తలు