Saturday, January 4, 2025
HomeCinemaShiva Jyoti :భ‌ర్త బండారం బ‌య‌ట‌పెట్టిన సావిత్ర‌క్క‌.. వీడియో చూసి అంద‌రు షాక్...!

Shiva Jyoti :భ‌ర్త బండారం బ‌య‌ట‌పెట్టిన సావిత్ర‌క్క‌.. వీడియో చూసి అంద‌రు షాక్…!

Shiva Jyoti :తీన్మార్ షో ద్వారా ఫుల్ పాపుల‌రిటీ సంపాదించుకుంది సావిత్రి అలియాస్ శివ‌జ్యోతి. ఈమె వార్త‌ల‌లో ఉన్న‌ప్పుడు తెలంగాణ యాక్సెంట్‌తో అద‌ర‌గొట్టేది. బిత్తిరి స‌త్తితో క‌లిసి ఈమె చేసిన సంద‌డి మాములుగా ఉండేది కాదు. బిత్తిరి స‌త్తి అక్క అని ఆమెని పిల‌వ‌డం, సావిత్రి ఏందిరా అంటూ అత‌నిపై పంచ్‌లు వేయ‌డం ప్రేక్ష‌కుల‌కి మంచి మజా అందించేది. అయితే ఈ కాంబో విడిపోయిన త‌ర్వాత ఎవ‌రికి వారు ఓన్‌గా ప‌లు షోలు చేస్తున్నారు. అయితే సావిత్రి క్రేజ్‌తో ఆమెకి బిగ్ బాస్ షో ఆఫ‌ర్ కూడా ద‌క్కింది. అందులో చాలా వారాల పాటే ఉంది. ఫినాలే ఎపిసోడ్‌కి ముందు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఆ సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేత‌ నిలిచాడు. యాంకర్ శ్రీముఖి రన్నర్ అయ్యింది.

అయితే సావిత్రి టైటిల్ గెలవకపోయినా చాలా అభిమానులని సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌టకు వచ్చాక సావిత్రి రేంజ్ మారింది. వార్త‌లు కాకుండా షోల‌లో సంద‌డి చేస్తుంది. ఇక సొంత‌గా యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో తరచుగా వీడియోలు షేర్ చేస్తూ ఒక‌వైపు త‌న అభిమానులని అల‌రిస్తూనే మ‌రోవైపు రెండు చేతులా సంపాదిస్తుంది. ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో ఎక్కువ‌గా క‌లిసి రీల్స్ చేస్తుండ‌డం, అవి నెటిజ‌న్స్‌కి ఎంత‌గానో న‌చ్చుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అయితే తాజాగా శివ‌జ్యోతి త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో త‌న భ‌ర్త ఆల్కహాలిక్ హ్యాబిట్ ని ఎక్స్ పోజ్ చేసింది. ఇది చూసిన వారంద‌రు మీ భ‌ర్త ఇంత తాగుబోతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో చూస్తే.. శివ జ్యోతి వేలకు వేలు కాస్మొటిక్స్ కోసం ఖర్చు చేస్తుందని ఆమె భ‌ర్త గంగూలీ కూసింత ఆగ్ర‌హం వ్య‌క్ం చేస్తుంటాడు. అప్పుడు శివ జ్యోతి నేను చేసిన ఖర్చు చాలా తక్కువే నీ ఖర్చు చూపిస్తానంటూ ఇంట్లోని స‌ప‌రేట్ ర్యాక్‌లో ఉన్న ఖరీదైన ఫారిన్ మందు బాటిళ్లు చూపిస్తుంది.. ఒక్కో బాటిల్ ధర ఆరాడు వేలు ఉంది. దీని కంటే అవి ఎక్కువ‌నా అని అంటుంది. అప్పుడు దానికి గంగూలీ ఇంకో రెండు మూడు కొనుక్కో అని చెబుతాడు. అయితే వీడియో చూసిన వారంద‌రు కూడా శివ జ్యోతి భర్త మందు తాగుతాడని అంటున్నారు. అయితే వ్యూస్ కోసం ఇలా భ‌ర్త‌ని దిగ‌జార్చ‌డం ఏమి బాలేదు అంటూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shiva Jyothi (@iam.savithri)

RELATED ARTICLES

తాజా వార్తలు