Friday, January 3, 2025
HomeCinemaDivorce| భార్య పేరుతో ఉన్న టాటూని తొల‌గించిన సైఫ్ అలీ ఖాన్.. ఈ జంట విడాకులు...

Divorce| భార్య పేరుతో ఉన్న టాటూని తొల‌గించిన సైఫ్ అలీ ఖాన్.. ఈ జంట విడాకులు తీసుకోబోతుందా?

Divorce| ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల పెళ్లి విష‌యం క‌న్నా కూడా వారి డైవ‌ర్స్ విష‌యాలే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నాయి. చిన్న‌చిన్న వాటికి విడాకులు తీసుకుంటూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో జంట విడాకుల‌కి సిద్ధ‌మైందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో విడాకులు తీసుకునే జంట‌లు డైరెక్ట్‌గా త‌మ విడాకుల విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం లేదు. సోష‌ల్ మీడియాలో పేర్లు మార్చ‌డ‌మో లేదంటూ టాటూలు చెరిపేయ‌డ‌మో వంటివి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ త‌న భార్య క‌రీనా క‌పూర్ పేరుతో వేయించుకున్న టాటూని చెరిపేసుకున్నాడు. దీంతో వారిద్ద‌రి విడాకుల విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్ లో బెస్ట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న‌ సైఫ్ అలీఖాన్.. కరీనాకపూర్ జంట ఇప్పుడు విడిపోతున్నారనే వార్తలు బాలీవుడ్ ఉలిక్కిప‌డేలా చేశాయి. సైఫ్ అలీఖాన్ కు గతంలో తన చేతి పైన కరీనా అనే పేరుతో ఒక టాటూ ఉండేది. అయితే ఈ మ‌ధ్య ఆ పేరుని తొల‌గించ‌డం చేశాడు. ఇక వారిద్ద‌రు ఇటీవ‌ల క‌లిసి కనిపించింది కూడా లేదు. మ‌రోవైపు క‌రీనా క‌పూర్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా బోల్డ్‌గా క‌నిపించ‌డ‌మే కాకుండా , సినిమాలు ఎక్కువ‌గా చేస్తుంది. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రు విడాకులు తీసుకున్నార‌ని జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నయి. అయితే ఇక్క‌డ మ‌రో వాద‌న కూడా ఉంది. సైఫ్ అలీ ఖాన్ త‌న చేతిపై క‌రీనా టాటూని టెంప‌ర‌రీగానే వేయించుకున్నాడ‌ని, దేవ‌ర సినిమా కోసం దానిని చెరిపేశాడ‌ని కొందరు అంటున్నారు

ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా కోసం ప్ర‌త్యేక టాటూని వేయించుకున్నారు. అయితే క‌రీనా పేరుపైన త్రిశూల్ డిజైన్ ఇంక్ వేయించుకున్నాడ‌ని, సినిమా పూర్త‌యిన త‌ర్వాత అది తొల‌గించ‌బ‌డుతుంద‌ని, మ‌ళ్లీ క‌రీనా పేరుతో ఉన్న టాటూ క‌నిపిస్తుంద‌ని ఇంకొంద‌రు చెబుతున్న మాట‌. మ‌రి ఈ వార్త‌ల‌లో ఎంత నిజం ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది. ఇక ఈ జంట 2012 లో వివాహం చేసుకున్నారు. బి-టౌన్‌లోని హాటెస్ట్ సెలెబ్స్‌లో ఒకరైన ఈ జంట ఎప్పుడు మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటారు.

RELATED ARTICLES

తాజా వార్తలు